బ్యాగ్ లో పేలిన స్మార్ట్ ఫోన్.. ఎగిసిపడిన మంటలు వీడియో వైరల్!

April 21, 2021 10:18 PM

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు ఫోన్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఎన్నో సందర్భాలలో మనం వినే ఉంటాం. చార్జింగ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడటం,లో బ్యాటరీ ఉన్న ఫోన్ ఉపయోగించడం వంటి సందర్భాలలో ఫోన్లు పేలే ప్రమాదాలు ఉంటాయి. ఈ క్రమంలోనే చైనాలో ఒక వ్యక్తి తన బ్యాగ్ లో స్మార్ట్ ఫోన్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ట్వీట్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి ఒక అమ్మాయితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు.ఈ క్రమంలోనే అతని బ్యాగ్ నుంచి పెద్ద శబ్దంతో మంటలు ఎగిసిపడ్డాయి. శబ్దం రావడంతో ఆ వ్యక్తి ఆ బ్యాగ్ ను విసరడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తరువాత బాగా తెరిచి చూడగా బ్యాగులో అతని ఫోన్ కాలిపోతూ కనిపించింది.

ఈ ఘటనలో ఆ వ్యక్తి భుజానికి గాయం కాగా తల వెంట్రుకలు కాలిపోయాయి. ఫోన్ పేలగానే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ముఖ్యంగా బ్యాగ్ లో ఫోన్ పెట్టుకోవడం వల్ల మరింత ప్రమాదం తప్పిందని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment