వామ్మో.. 6300 అడుగుల ఎత్తులో కొండ అంచు నుంచి ప‌డిపోయారు.. వీడియో..!

July 21, 2021 8:22 PM

సాహ‌సాలు చేసేట‌ప్పుడు ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. చిన్న తేడా వ‌చ్చినా ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి. త‌రువాత ఏం చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అయితే కొన్ని సార్లు అలాంటి సంద‌ర్భాల్లో కొంద‌రు ల‌క్కీగా బ‌య‌ట ప‌డుతుంటారు. ర‌ష్యాలోనూ స‌రిగ్గా అలాగే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

two women fell from cliff edge viral video

ర‌ష్యాలోని సుల‌క్ కాన‌యాన్ అనే కొండ ప్రాంతంలో కొండ అంచు ఒక పెద్ద ఉయ్యాల ఉంది. అందులో కూర్చుని ఊగ‌వ‌చ్చు. ఊగిన‌ప్పుడ‌ల్లా కొండ నుంచి దూరంగా పోతారు. మ‌ళ్లీ వెన‌క్కి వ‌స్తారు. దాని మీద కూర్చుని ఊగుతుంటే లోయ‌లోకి వెళ్లిన‌ట్లు ఫీలింగ్ క‌లుగుతుంది. ఆ లోయ ఎత్తు 6300 అడుగులు.

https://twitter.com/Random_Uncle_UK/status/1415209072090042372

అయితే ఆ ఉయ్యాల మీద ఇద్ద‌రు మ‌హిళ‌లు కూర్చుని ఊగ‌సాగారు. వెనుక నుంచి ఒక వ్య‌క్తి వారి ఉయ్యాల‌ను ఊపుతున్నాడు. కానీ స‌డెన్‌గా అనుకోకుండా ఆ మ‌హిళ‌ల‌కు బ్యాలెన్స్ త‌ప్పింది కొండ అంచు నుంచి కింద‌కు ప‌డిపోయారు. కానీ ల‌క్కీగా వారు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ్డారు. స్వ‌ల్ప గాయాలు మాత్ర‌మే అయ్యాయి. వారు పూర్తిగా లోయ‌లో ప‌డిపోక ముందే వారిని ర‌క్షించారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి పోలీసు అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment