ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఆవుకు రెండు త‌ల‌ల దూడ జ‌న‌నం.. దైవంగా భావించి పూజ‌లు..

June 14, 2021 3:34 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ గ్రామంలో ఓ ఆవు రెండు త‌ల‌ల దూడ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో ఈ విష‌యం అక్క‌డ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అక్క‌డి చందౌలి జిల్లాలో ఆవుకు రెండు త‌ల‌ల దూడ జన్మించింది. దానికి రెండు నోళ్లు, రెండు చెవులు, నాలుగు క‌ళ్లు ఉన్నాయి. అర‌వింద్ యాద‌వ్ అనే వ్య‌క్తికి చెందిన ఆవుకు ఆ దూడ జ‌న్మించింది. అయితే ప్ర‌స్తుతం ఆవు, దూడ రెండూ ఆరోగ్యంగానే ఉన్నాయి.

two headed calf born in uttar pradesh

ఈ సంద‌ర్భంగ యాద‌వ్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఉద‌యం ఆ దూడ జ‌న్మించిందని తెలిపాడు. దాన్ని చూసి త‌మ కుటుంబ‌మంతా ఒక్క‌సారిగా షాక్‌కు గురైంద‌న్నాడు. అయితే ఈ విష‌యం ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా వ్యాపించింది. దీంతో దూడ‌ను చూసేందుకు గ్రామ‌స్థులు తండోప తండాలుగా అక్క‌డికి చేరుకుంటున్నారు. దూడ అలా జ‌న్మించడంతో దాన్ని దైవానికి ప్ర‌తి రూప‌మ‌ని భావిస్తున్నారు. దానికి పూజ‌లు చేస్తున్నారు.

అయితే వెట‌ర్న‌రీ వైద్యులు మాత్రం ఇలా అత్యంత అరుదుగా జ‌రుగుతుంటుంద‌న్నారు. దీనిపై చందౌలి చీఫ్ వెట‌ర్న‌రీ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ స‌త్య ప్ర‌కాష్ మాట్లాడుతూ ఆవు గ‌ర్భంలో అసాధార‌ణ రీతిలో క‌ణాలు పెర‌గ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంద‌ని, అంతే కానీ దూడ ఏమీ దైవం కాద‌ని కొట్టి పారేశారు. అయిన‌ప్ప‌టికీ స్థానికులు మాత్రం ఆ దూడను చూసేందుకు ఆస‌క్తి చూపిస్తుండ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment