సాధారణంగా మనం గొర్రెల నుంచి తీసిన ఉన్నితో వివిధ రకాల బ్లాంకెట్స్, జర్కిన్లు, మఫ్లర్లు, స్కార్ఫ్‌ల వంటి వాటిని తయారుచేయడం గురించి విన్నాము. కానీ.. మీరెప్పుడైనా కుక్క బొచ్చుతో స్కార్ఫ్ ను తయారు చేయించడం విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మిషెల్ పార్కర్ అనే మహిళ తన పెంపుడు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకుంది.. అసలు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
మిషెల్ పార్కర్ అనే మహిళకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఈ మహిళ 2 పెంపుడు కుక్కలను పెంచుకుంటోంది. వాటి పేర్లను లూకా, కిషోన్డ్ గా పెట్టుకుని వాటిని ఎంతో అపురూపంగా చూసుకునేది. పెంపుడు కుక్కలు నిత్యం తన వెంటే ఉంటూ తన పట్ల ఎంతో ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శించేవి. అయితే పెంపుడు కుక్కలు మనం జీవించి ఉన్నంత కాలం ఉండవు. కనుక ఎప్పుడో ఒక రోజు ఆ కుక్కలు తనని వదిలి వెళ్లిపోతాయని, చనిపోతాయని భావించిన పార్కర్ వాటి గుర్తుగా తన దగ్గర ఏదైనా ఉండాలని భావించింది.
ఈ క్రమంలోనే ఫేస్ బుక్ లో ఒక వ్యక్తి పెంపుడు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకున్నాడని తెలియడంతో సదరు మహిళ కూడా ఎలాగైనా తను స్కార్ఫ్ చేయించుకోవాలని ఏకంగా 18 వేల రూపాయలను ఖర్చు చేసి తన రెండు పెంపుడు కుక్కలు నుంచి 525 గ్రాముల బొచ్చును తీసుకుని స్కార్ఫ్ తయారు చేయించుకుంది. ఈ విధంగా తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ స్కార్ఫ్ చేయించుకోవడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…