తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలియజేసింది. తెలంగాణలో పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను భర్తీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న 172 జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 18, 2021 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా 10 అక్టోబర్ 2021 వరకు దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ ఖాళీలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నందువల్ల విద్యార్హతలతోపాటు పలు క్రీడలలో అర్హత సాధించి ఉండాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా గైడ్‌లైన్స్ పూర్తి చేసి ఉన్నవారు అర్హులు.
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉండాలి. జనరల్, బీసీ క్రీమీలేయర్ కేటగిరీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు రూ.400 ఫీజుగా నిర్ణయించారు. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వంద మార్కులకు ఒక పేపర్ చొప్పున రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలుగా హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలను కేటాయించారు. దరఖాస్తులకు అక్టోబర్ 10 చివరి తేదీ.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…