వామ్మో.. బాలిక కంటిలో నుంచి రాలి పడుతున్న రాళ్లు.. వీడియో వైరల్..

September 25, 2021 10:05 PM

సాధారణంగా మనం ఏడ్చినా, నవ్వినా మన కంటిలో నుంచి కన్నీళ్లు వస్తాయి. కానీ మీరెప్పుడైనా కళ్ల నుంచి రాళ్లు రాలడం చూశారా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ పరిధిలో ఉన్న గుర్సాహైగంజ్ అనే ప్రాంతంలో చాందిని అనే బాలిక ఎడమ కంటిలో నుంచి రాళ్ళు పడుతున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే తన కూతురిని ఈ సమస్య నుంచి కాపాడుకోవడం కోసం తమ తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.

వామ్మో.. బాలిక కంటిలో నుంచి రాలి పడుతున్న రాళ్లు.. వీడియో వైరల్..

చాందిని జూలై 15వ తేదీ నుంచి ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడుతోంది. ఈమె ఏడ్చిన కంటిని కొద్దిగా నులిమినా ఎడమ కంటి నుంచి చిన్నపాటి సైజులో ఉన్న రాళ్ళు పడటంవల్ల తన కన్ను దురద పెట్టి తీవ్ర నొప్పి కలిగిస్తుందని బాధితురాలు పేర్కొంటోంది. అయితే తనకు మెరుగైన చికిత్స కోసం ఎన్నో ప్రముఖ ఆస్పత్రులకు చూపించినా.. డాక్టర్లు ఈ విషయం తెలుసుకొని ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు చాందిని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

https://youtu.be/IM3UQ1Q60Yk

గతంలో కూడా ఈ విధమైనటువంటి సమస్యలతో ఎంతో మంది బాధ పడ్డారు. అయితే రెండు కళ్ళలో చిన్నపాటి రాళ్లు పడటం చూశాము కానీ ఈ బాలికకు మాత్రం ఒకే కన్నులో నుంచి రాళ్లు పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మెరుగైన వైద్య చికిత్స చేయిస్తే బాలిక ఈ సమస్య నుంచి గట్టెక్కుతుందని, బాలికకు చికిత్స చేయించడం కోసం ప్రభుత్వం సహాయం చేయాలని బాధితురాలి తండ్రి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment