పోలీసు క‌ర్క‌శ‌త్వం.. కూర‌గాయ‌లు అమ్ముకునే వ్య‌క్తిపై ప్ర‌తాపం..

May 5, 2021 10:31 PM

అస‌లే క‌రోనా క‌ష్టకాలం. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని పేద‌లు. అలాంటి వారిపై వీలైతే క‌నిక‌రం చూపించాలి. కానీ క‌ర్క‌శ‌త్వం కాదు. ఆ పోలీస్ ఆఫీస‌ర్ అలాగే చేశాడు. ర‌హ‌దారి ప‌క్క‌న బండిపై కూర‌గాయ‌లు అమ్ముకుంటున్న ఓ వ్య‌క్తిపై దాడి చేశాడు. ఈ క్ర‌మంలో అత‌ని తోపుడు బండిని కాలితో త‌న్నాడు. దీంతో దానిపై ఉన్న కూర‌గాయ‌లు అన్నీ నాశ‌నం అయ్యాయి. అయితే ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్ కావ‌డంతో ఉన్న‌తాధికారులు అత‌న్ని స‌స్పెండ్ చేశారు.

sho from punjab cruelty on street vendor

పంజాబ్‌లో మే 15వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను విధించారు. నిత్యావ‌స‌రాలు, అత్య‌వ‌స‌రం అయ్యే వ‌స్తువులు, స‌రుకుల‌ను మాత్ర‌మే అమ్మేందుకు అనుమ‌తులు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఓ వ్య‌క్తి త‌న తోపుడు బండిపై కూర‌గాయ‌లు అమ్ముకుంటుంటే అత‌నిపై అక్క‌డి స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ న‌వదీప్ సింగ్ కించిత్ జాలి చూపించ‌లేదు. ఆ తోపుడు బండిని కాలితో త‌న్నాడు.

అయితే ఆ వీడియో వైర‌ల్ అయిన అనంత‌రం విష‌యం ఆ రాష్ట్ర డీజీపీ వ‌ర‌కు వెళ్లింది. దీంతో డీజీపీ దిన‌క‌ర్ గుప్తా న‌వ‌దీప్ సింగ్‌ను స‌స్పెండ్ చేశారు. ఇక ఆ సంఘ‌ట‌న జ‌రిగిన ఫ‌గ్‌వారా ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులు త‌మ జీతాల్లోంచి కొంత మొత్తాన్ని సేక‌రించి ఆ వ్య‌క్తికి న‌ష్ట ప‌రిహారం కింద అంద‌జేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment