పాములను చూస్తేనే సహజంగానే చాలా మందికి పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక అవి వెంట పడితే విపరీతమైన భయం కలుగుతుంది. పాములు ఆమడ దూరంలో ఉంటేనే చాలా మంది జంకుతారు. ఇక అవి దగ్గరకు వస్తే అంతే సంగతులు. దూరంగా పారిపోతారు. అయితే ఓ కారులో ప్రయాణిస్తున్న వారికి కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సౌతాఫ్రికాలోని క్రుగర్ నేషన్ పార్క్ అది. అక్కడ కొందరు పర్యాటకులు కారులో రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఆగారు. మార్గమధ్యలో ఓ కొండ చిలువ రోడ్డుపై వచ్చి పోయే వాహనాల మీదకు దూకేందుకు ప్రయత్నిస్తోంది. అయితే దానికి ఒక వైపు ఆగి ఉన్న కారును అది గమనించి అందులో ఇంజిన్‌లోకి ప్రవేశించింది. దీంతో ఆ కారును వారు ఆపి ముందట బాయ్‌నెట్ తెరిచారు. అక్కడ ఇంజిన్ మీద ఎంచక్కా ఆ కొండ చిలువ పడుకుని ఉండడాన్ని వారు గమనించారు.
అయితే వారు దాన్ని చంపలేదు. అది ఇంజిన్‌లోకి వెళ్లేందుకు యత్నించింది. దీంతో ఓ వ్యక్తి దాన్ని పట్టుకుని పక్కనే ఉన్న పొదల్లోకి విడిచిపెట్టాడు. కాగా అదే సమయంలో వీడియో తీసి దాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నో లక్షల మంది ఆ వీడియోను ఇప్పటికే వీక్షించారు. ఆ పామును చూస్తే చాలా భయం కలుగుతుందని నెటిజన్లు చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…