సాధారణంగా కొందరిలో రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ విధమైన సమస్యతో బాధపడేవారు నలుగురిలో కలిసి మాట్లాడలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మద్యపానం ధూమపానం తంబాకు అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. అదేవిధంగా కొందరిలో ఏ విధమైనటువంటి చెడు అలవాటు లేకున్నప్పటికీ వారికి నోటి దుర్వాసన సమస్య వెంటాడుతోంది. ఈ విధంగా నోటి దుర్వాసన రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మన నోరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల వెలువడే దుర్వాసన, మరొకటి కడుపులో జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగా లేనప్పుడు నోటినుంచి ఈ విధమైనటువంటి దుర్వాసన వెలువడుతుంది. ఈ విధంగా వచ్చే నోటి దుర్వాసనను ‘హాలిటోసిస్’ అంటారు. మరి ఈ నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందాలంటే ఈ చిన్న చిట్కాలను పాటించాల్సిందే.
*నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కోవాలంటే తరచూ తులసి, జామ, పుదీనా, యూకలిప్టస్ వంటి ఆకులను నమలడం ద్వారా నోటిలో ఏర్పడిన బ్యాక్టీరియాలో తొలగిపోయి నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
*ప్రతి రోజు భోజనం తర్వాత ఏలక్క, కొత్తిమీర, పుదీనా, లవంగం నోటిలో పెట్టుకుని చప్పరించడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
*ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తాజా పెరుగును తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి సమస్య నుంచి విముక్తి పొందవచ్చని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా పెరుగును తరచూ తినడం వల్ల దంతాలపై ఏర్పడిన పాచీ, చిగుళ్ల సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చు.
*పీచు పదార్థాలు అధికంగా కలిగి ఉన్న పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల అధిక లాలాజలం ఉత్పత్తి అయి నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది.
*ఈ విధంగా నోటి దుర్వాసనతో బాధపడేవారు ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక నోటి దుర్వాసనను అదుపుచేయడానికి దోహద పడుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…