ఎంఎస్ ధోనీ కొత్త లుక్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

July 30, 2021 9:42 PM

క్రికెట్ ప్లేయ‌ర్ల‌లో స్టైల్ అనే ప‌దం విన‌బ‌డ‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది మ‌హేంద్ర సింగ్ ధోనీయే. ఎంఎస్ ధోనీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త స్టైల్స్ లో మ‌న‌కు ద‌ర్శ‌నమిస్తుంటాడు. నూత‌న ట్రెండ్స్‌ను ఫాలో అవుతుంటాడు. కొత్త కొత్త లుక్‌ల‌లో ఆశ్చ‌ర్య ప‌రుస్తుంటాడు. ఇక తాజాగా ధోనీ హెయిర్ క‌ట్ చేయించుకుని త‌న కొత్త స్టైల్‌కు చెందిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ms dhoni new look photos viral

హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హ‌కీమ్ ధోనీకి హెయిర్ క‌ట్ చేశాడు. అనంత‌రం ధోనీ ఫొటోల‌ను హ‌కీమ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ధోనీ కొత్త హెయిర్ క‌ట్‌కు అత‌ని అభిమానులు ఫిదా అవుతున్నారు.

కాగా ధోనీ ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఈ ఏడాది మ‌ధ్య‌లోనే ఐపీఎల్ ఆగిపోయింది. కోవిడ్ కేసులు బ‌య‌ట ప‌డ‌డంతో ఐపీఎల్‌ను 31 మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే వాయిదా వేశారు. ఈ క్ర‌మంలోనే సెప్టెంబ‌ర్ 19 నుంచి అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు ఆ మ్యాచ్‌లు యూఏఈలో జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఈ ఐపీఎల్ ధోనీకి ఆఖ‌రిది అని భావిస్తున్నారు. దీంతో చివ‌రి టోర్నీలో ధోనీ సార‌థ్యంలో ఎలాగైనా స‌రే చెన్నై ట్రోఫీని ఎత్తాల‌ని భావిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment