వైర‌ల్ వీడియో: మ‌ద్యం షాపులోకి ప్ర‌వేశించిన కోతి.. బాటిల్ అందుకుని విస్కీ తాగింది..!

July 17, 2021 2:03 PM

కోతులు చాలా చిత్రాతి చిత్ర‌మైన ప‌నులు చేస్తుంటాయి. అవి చేసే ప‌నులు మ‌న‌కు న‌వ్వు తెప్పిస్తాయి. అయితే ఓ కోతి ఏకంగా మ‌ద్యం తాగింది. ఈ చిత్ర‌మైన సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. అక్క‌డి మాండ్లా జిల్లాలో ఓ వైన్ షాపులోకి ప్ర‌వేశించిన కోతి ఏకంగా కొత్త విస్కీ బాటిల్‌ను తీసుకుని అందులోని మందును తాగింది.

monkey drank liquor in store viral video

కాగా కోతి మ‌ద్యం సేవిస్తున్న‌ప్పుడు తీసిన ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 1 నిమిషం 14 సెక‌న్ల నిడివి ఉన్న ఆ వీడియోను సోష‌ల్ ప్లాట్‌ఫాంల‌లో తెగ చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

https://twitter.com/smaheshwari523/status/1415340792311279617

ఇక కోతి మ‌ద్యం తాగుతుండ‌గా షాపులోని వ్య‌క్తి అలాగే చూస్తూ ఉన్నాడు. త‌ప్ప ఏమీ చేయ‌లేక‌పోయాడు. చుట్టు ప‌క్క‌ల ఉన్న ఎవ‌రూ ఆ కోతిని అక్క‌డి నుంచి వెళ్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. కొంద‌రు ఆ కోతిని మ‌ద్యం సేవించాల‌ని చీర్స్ చెప్ప‌డం విన‌వ‌చ్చు. ఇక కొంద‌రు స్నాక్స్ కూడా ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment