వీడియో వైరల్: దెబ్బకి విమానంలోనే ఒక్కటైన‌ జంట!

May 25, 2021 5:02 PM

సాధారణంగా పెళ్లిళ్లు భూలోకంలో ఆకాశమంత పందిళ్లను వేసే ఎంతో అంగరంగ వైభవంగా జరిపించడం మనం చూస్తూ ఉంటాము. కానీ కరోనా ప్రభావం వల్ల వివాహాలు ఎంతో సింపుల్ గా జరుగుతున్నాయి. ప్రస్తుతం వివాహాలు అధికంగా ఉన్న సమయంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో ఎంతో ఘనంగా చేయాలనుకున్న వివాహాలు సైతం సింపుల్ గా కానిచ్చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మధురైకి చెందిన రాకేష్, దక్షిణల వివాహ మే 25 మంగళవారం జరగాల్సి ఉంది. అందుకోసం పెళ్లి ఏర్పాట్లను ఎంతో ఘనంగా నిర్వహించిన ఇరు కుటుంబసభ్యులు వివాహం కోసం బెంగళూరు నుంచి విమానంలో మధురై కి బయలుదేరారు. ఈ క్రమంలోనే తమిళనాడులో కరోనా కేసులు అధికమవుతున్న నేపధ్యంలో మంగళవారం నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది.

ఈ విధంగా లాక్ డౌన్ ప్రకటించడంతో చేసేదేమీ లేక పెళ్లి ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు. అదేవిధంగా ఇరు కుటుంబ సభ్యులు రాకేష్ , దక్షిణల వివాహం విమానంలోనే జరిపించారు. ఇరు కుటుంబ సభ్యుల పెద్దల సమక్షంలో, వారి ఆశీర్వాదాలతో విమానంలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment