ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వైరల్ వీడియోలు, ఫొటోల సంఖ్య పెరిగింది. ఇటీవల ఫ్లయింగ్ దోశ, ఫ్లయింగ్ వడా పావ్ వంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా మరో వీడియో వైరల్ అవుతోంది. పాతదే అయినప్పటికీ నెటిజన్లు ఆ వీడియోను ఎక్కువగా వీక్షిస్తున్నారు.
ముంబైలోని మలద్ అనే ప్రాంతంలో ఎన్ఎల్ కాలేజీ సమీపంలో ఓ వ్యక్తి సైకిల్‌పై తిరుగుతూ దోశలు వేసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి అక్కడ సైకిల్ దోశ వాలా అని పేరుంది. అలా అతను 25 ఏళ్లుగా దోశలు వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సైకిల్ వెనుక స్టాండ్ మీద ఒక పెనం ఉంటుంది. దానిపై అడిగిన వాళ్లకు వెంటనే దోశ వేసి ఇస్తాడు. ఇక దోశలోకి కావల్సిన పదార్థాలు కూడా సైకిల్ మీదే ఉంటాయి. అతను వేసే దోశలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అందుకనే చాలా మంది స్థానికులు అతని వద్ద దోశలను తింటుంటారు. ఇక దోశ రకాన్ని బట్టి రూ.60 నుంచి రూ.100 వరకు తీసుకుంటాడు.
అయితే అతని వీడియో వైరల్ అయ్యే సరికి చాలా మంది స్పందిస్తున్నారు. సైకిల్ పై తిరుగుతూ అంత కష్టపడుతున్న అతనికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అతను ఎక్కడ ఉంటాడో చెప్పాలని కోరుతున్నారు. అతని వీడియో వైరల్ అవుతుండడంతో అతనికి సహాయం చేసేందుకు చాలా మంది ఆసక్తిగా అతని గురించి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఆ సైకిల్ దోశ వాలా జీవితం మారుతుందా, లేదా.. అనేది చూడాలి.
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…