స‌మాచారం

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను మార్చిన కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌.. కొత్త రేట్ల వివ‌రాలు..

ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ కోట‌క్ మ‌హీంద్రా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను మార్చింది. ఈ క్ర‌మంలో మార్చిన ప్ర‌కారం వ‌డ్డీ రేట్ల‌ను అందివ్వ‌నుంది. 7 నుంచి 30 రోజుల వ్య‌వ‌ధి క‌లిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు, 31 నుంచి 90 రోజులు, 91 నుంచి 179 రోజుల వ్య‌వ‌ధి క‌లిగిన ఎఫ్‌డీల‌కు బ్యాంకు వ‌రుస‌గా 2.5, 2.75, 3.25 శాతం వ‌డ్డీ రేట్ల‌ను చెల్లించ‌నుంది. అలాగే 180 రోజుల నుంచి 1 ఏడాది వ్య‌వ‌ధి గ‌ల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై 4.40 శాతం వ‌డ్డీ రేటును అందిస్తోంది. అలాగే 1 ఏడాది నుంచి 389 రోజుల వ్య‌వ‌ధి వ‌ర‌కు అయితే 4.50 శాతం వ‌డ్డీని చెల్లిస్తుంది.

390 రోజుల నుంచి 23 నెల‌ల కాలానికి ఎఫ్‌డీల‌కు 4.90 శాతం, 23 నెల‌ల నుంచి 3 ఏళ్ల కాలానికి 5 శాతం వ‌డ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది. 3 ఏళ్లు ఆపైన, 4 ఏళ్ల లోపు కాలానికి ఎఫ్‌డీల‌కు 5.10 శాతం, 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు ఎఫ్‌డీలు అయితే 5.25 శాతం వ‌డ్డీని అందిస్తోంది. 5 ఏళ్ల పైన 10 ఏళ్ల లోపు అయితే 5.30 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. స‌వ‌రించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల‌ను కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌ మార్చి 25, 2021వ తేదీ నుంచి అమ‌లు చేస్తోంది.

కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు అందిస్తున్న స‌వ‌రించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

  • 7 నుంచి 14 రోజుల వ‌ర‌కు 2.50 శాతం
  • 15 నుంచి 30 రోజుల వ‌ర‌కు 2.50 శాతం
  • 31 నుంచి 45 రోజుల వ‌రకు 2.75 శాతం
  • 46 నుంచి 90 రోజుల వ‌ర‌కు 2.75 శాతం
  • 91 నుంచి 120 రోజుల వ‌ర‌కు 3.25 శాతం
  • 121 నుంచి 179 రోజుల వ‌ర‌కు 3.25 శాతం
  • 180 రోజుల వ‌ర‌కు 4.40 శాతం
  • 181 రోజుల నుంచి 269 రోజుల వ‌ర‌కు 4.40 శాతం
  • 270 రోజుల వ‌ర‌కు 4.40 శాతం
  • 271 రోజుల నుంచి 363 రోజుల వ‌ర‌కు 4.40 శాతం
  • 364 రోజుల వ‌ర‌కు 4.40 శాతం
  • 365 రోజుల నుంచి 389 రోజుల వ‌ర‌కు 4.50 శాతం
  • 390 రోజుల వ‌ర‌కు 4.90 శాతం
  • 391 రోజుల నుంచి 23 నెల‌ల లోపు – 4.90 శాతం
  • 23 నెల‌ల‌కు – 5 శాతం
  • 23 నెల‌ల 1 రోజు నుంచి 2 ఏళ్ల లోపు – 5 శాతం
  • 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు – 5 శాతం
  • 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల లోపు – 5.10 శాతం
  • 4 నుంచి 5 ఏళ్ల లోపు – 5.25 శాతం
  • 5 నుంచి 10 ఏళ్ల వ‌ర‌కు – 5.30 శాతం

ఇక సీనియ‌ర్ సిటిజెన్స్‌కు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందించే వ‌డ్డీ రేట్ల క‌న్నా 50 బేసిస్ పాయింట్ల వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. వారు క‌నీసం 7 రోజుల నుంచి గ‌రిష్టంగా 10 ఏళ్ల వ‌ర‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను వేయ‌వ‌చ్చు. 3 నుంచి 5.8 శాతం వ‌ర‌కు వ‌డ్డీ చెల్లిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM