రెండేళ్ల కింద‌ట వేస‌క్ట‌మీ చేయించుకున్న వ్య‌క్తి.. తాజాగా భార్య గ‌ర్భిణీ అని తెలిసి షాక్‌..!

September 7, 2021 11:23 AM

గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు ఆ విష‌యాన్ని త‌మ భ‌ర్త‌ల‌కు ఎంతో సంతోషంగా చెబుతారు. దీంతో వారు ఎంతో హ్యాపీగా ఫీల‌వుతారు. మొద‌టిసారి అయితే తాము తండ్రి అవుతున్నందుకు ఎంతో సంతోషిస్తారు. త‌రువాత కూడా భార్య గ‌ర్భం దాలిస్తే సంతోషిస్తారు. అయితే అత‌నికి మాత్రం త‌న భార్య గ‌ర్భం దాల్చినందుకు సంతోషం కాదు క‌దా.. తీవ్ర‌మైన మ‌న‌స్థాపం క‌లుగుతోంది. ఎందుకంటే..

రెండేళ్ల కింద‌ట వేస‌క్ట‌మీ చేయించుకున్న వ్య‌క్తి.. తాజాగా భార్య గ‌ర్భిణీ అని తెలిసి షాక్‌..!

ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో తాజాగా ఓ పోస్టు పెట్టాడు. అందులో త‌న వివ‌రాల‌ను వెల్ల‌డించాడు. తాను 2 ఏళ్ల కింద‌ట వేస‌క్ట‌మీ చేయించుకున్నాన‌ని, అయితే త‌న భార్య ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి అని తెలిపాడు. తాను పిల్ల‌లు పుట్ట‌కుండా ఆప‌రేష‌న్ చేయించుకున్నా కూడా ఇప్పుడు తన భార్య గ‌ర్భ‌వ‌తి అవ‌డం ఏమిటని.. అత‌ను అందులో పేర్కొన్నాడు.

అయితే ఎన్నో ఏళ్ల నుంచి త‌న భార్య‌తో సంతోషంగానే ఉంటున్నాన‌ని, త‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నార‌ని, అందువ‌ల్ల త‌న భార్య త‌న‌ను మోసం చేస్తుంద‌ని భావించ‌డం లేద‌ని.. ఈ విష‌యంలో ఏం చేయాలో సూచ‌న‌లు చెప్పండి.. అంటూ ఆ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో నెటిజ‌న్లు భిన్న ర‌కాలుగా స‌ల‌హాలు ఇస్తున్నారు.

భార్య‌ను మోసం చేయ‌వ‌ద్ద‌ని, విధిని అంగీక‌రించి సంతోషంగా ఉండ‌మని కొంద‌రు స‌ల‌హా ఇచ్చారు. అయితే కొంద‌రు మాత్రం బిడ్డ పుట్టే వ‌ర‌కు ఆగి డీఎన్ఏ టెస్టు చేయించ‌మ‌ని చెప్పారు. ఇంకొంద‌రు వేస‌క్ట‌మీ ఫెయిల్ అయి ఉండ‌వ‌చ్చు. అంత‌మాత్రాన కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. ఇది స‌హ‌జంగానే జ‌రుగుతుంది. నిజం నిల‌క‌డ మీద తెలుస్తుంది. భార్య‌ను విడిచిపెట్ట‌కు.. అని స‌ల‌హా ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అత‌ని పోస్టు వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment