వామ్మో.. స్కూట‌ర్ హ్యాండిల్ నుంచి ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వ‌చ్చిన నాగుపాము.. చాలా తెలివిగా ప‌ట్టేసిన వ్య‌క్తి.. వైర‌ల్ వీడియో..!

September 9, 2021 4:15 PM

పాముల‌ను ప‌ట్టుకోవాలంటే చాలా ఓపిక‌, స‌హ‌నం, నైపుణ్యం ఉండాలి. చిన్న పొర‌పాటు చేసినా దాని కాటుకు బ‌లి కావ‌ల్సి వ‌స్తుంది. అందుక‌నే కొంద‌రు నిష్ణాతులైన వారే ఆ ప‌ని చేస్తుంటారు. ఇక ఓ వ్య‌క్తి కూడా స‌రిగ్గా ఇలాగే చాలా నైపుణ్యంతో ఓపిగ్గా ఓ నాగుపామును ప‌ట్టాడు. వివ‌రాల్లోకి వెళితే..

వామ్మో.. స్కూట‌ర్ హ్యాండిల్ నుంచి ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వ‌చ్చిన నాగుపాము.. చాలా తెలివిగా ప‌ట్టేసిన వ్య‌క్తి.. వైర‌ల్ వీడియో..!

ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నంద తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి అత్యంత నైపుణ్యంతో చాలా చాక‌చ‌క్యంగా ఓ నాగుపామును ఎలా ప‌ట్టుకున్నాడో చూడ‌వ‌చ్చు.

స్కూట‌ర్ హెడ్‌లో దాక్కున్న పామును ముందుగా అత‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించాడు. త‌రువాత అది ప‌డ‌గ విప్పి పైకి లేవ‌గానే దానిపై ఓ 20 లీట‌ర్ల ఖాలీ వాట‌ర్ క్యాన్‌ను బోర్లా ఉంచాడు. దీంతో వెంట‌నే ఆ పాము అందులోకి వెళ్లింది. దీంతో అత‌ను దాన్ని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా వెంట‌నే ఆ పాము బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

అయితే ఆ పాము బ‌య‌ట‌కు వ‌చ్చినా దాన్ని మ‌ళ్లీ ఆ క్యాన్ లోప‌లికి చొప్పించాడు. అందుకు చాలా సేపు ఓపిగ్గా వేచి చూశాడు. చివ‌ర‌కు పాము అందులోకి వెళ్ల‌గానే వెంట‌నే దానిపై మూత పెట్టేశాడు. ఇది ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ ఏడాది కింద‌టి వీడియో ఇది. అయిన‌ప్ప‌టికీ ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. అత‌ను అంత చాకచ‌క్యంగా పామును ప‌ట్ట‌డాన్ని చూసి నెటిజ‌న్లు అత‌న్ని మెచ్చుకుంటున్నారు. అవును.. నిజంగా చాలా నైపుణ్యంతో పామును ప‌ట్టాడు మ‌రి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment