Doctor Prescription : కింద ఇచ్చిన ఫోటోను ఇప్పటికే మీరు చూసి ఉంటారు. ఇది ఏదో చిన్న పిల్లాడు రాసిన గీతలు కావు. ఒక డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్. అవును, మీరు విన్నది నిజమే. డాక్టర్లు మనకు అర్థం కాని విధంగా సహజంగానే ప్రిస్క్రిప్షన్ రాస్తుంటారు. ఆ ప్రిస్క్రిప్షన్ కేవలం మెడికల్ షాపు వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. అంత వరకు బాగానే ఉంది. కానీ మరీ ప్రిస్క్రిప్షన్ ఈవిధంగా ఉంటే ఎలా చెప్పండి. మెడికల్ షాపు వాళ్లకు కూడా అర్థం కాలేదు. అవును, ఆ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ను తాము చదవలేకపోయామని మెడికల్ షాపు వాళ్లు కూడా చేతులెత్తేశారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో ఉన్న నాగౌడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ రోగికి అక్కడి ప్రభుత్వ డాక్టర్ అమిత్ సోనీ కొన్ని మందులను వాడాలని చెప్పి ఒక ప్రిస్క్రిప్షన్ ను రాసి ఇచ్చాడు. దీంతో అతను ఆ చిట్టీని పక్కనే ఉన్న మెడికల్ స్టోర్‌లో చూపించాడు. అయితే ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను చూసిన మెడికల్ షాపు వాళ్లు ఖంగు తిన్నారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని వారు చెప్పారు. దీంతో అవాక్కవడం రోగి వంతైంది. డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ సహజంగానే అర్థం కాదు. కానీ మరీ మెడికల్ షాపు వాళ్లకు కూడా అర్థం కాని విధంగా ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాశాడు. దీంతో అతనిపై ఫిర్యాదు చేశారు.
ఇక ఈ సంఘటనపై సదరు జిల్లా హాస్పిటల్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎల్‌కే తివారీ మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే డాక్టర్ అమిత్ సోనీకి నోటీసులు జారీ చేశామని, అతని నుంచి సమాధానం రాగానే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక అమిత్ సోనీ రాసిన ప్రిస్క్రిప్షన్ ను తాము కూడా చదవలేకపోయామని తివారీ చెప్పడం విశేషం. ఏది ఏమైనా ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా ఒకసారి చూడండి. అర్థం అయితే చెప్పండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…