ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వ్యక్తిని చితకబాదిన యువతి.. వీడియో..

August 2, 2021 7:09 PM

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన సంఘటనలకు సంబంధించిన విషయాలు క్షణాలలో ప్రపంచం మొత్తం చూసేలా చేస్తున్నాయి. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా సమాజంలో జరిగే కొన్ని ఘటనలు గురించి అందరూ తెలుసుకోగలుగుతున్నారు. తాజాగా నడిరోడ్డుపై ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ యువతి చేసిన హంగామా వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సదరు యువతి ప్రవర్తనకు #ArrestLucknowGirl హ్యాష్‌ట్యాగ్‌ వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

లక్నోలోని అవధ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.అయితే ఇది ఎప్పుడు జరిగింది అనే విషయం క్లారిటీ లేకపోయినప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతి సదరు వ్యక్తి పట్టుకొని ఇష్టానుసారంగా కొట్టింది. ఈ యువతి ఆ వ్యక్తి పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఆ యువతి సదరు వ్యక్తిని చితకబాదడంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ తో సహా పలువురు మాట మాట్లాడకుండా చోద్యం చూస్తూ ఉన్నారు.

ఈ విధంగా సదరు యువతి అతనిని కొట్టడానికి కారణం ఏమిటని అడుగుతూ ఉండగా అతని ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టింది. ఈ క్రమంలోనే మరో వ్యక్తి ఈ దారుణం అడ్డుకోవడానికి రావడంతో అడ్డుగా వచ్చిన వ్యక్తి కాలర్ పట్టుకొని అతన్ని లాగి మరి కొట్టింది.అర్ధరాత్రి సమయంలో వీరి వ్యవహారంతో ట్రాఫిక్ జామ్ కాగా అక్కడున్న వారందరూ ఈ అమ్మాయి కి ఏమైంది అంటూ అరవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆ యువతిని సదరు వ్యక్తి ఢీకొట్టడంతో తనపై ఈ విధంగా ప్రవర్తించినట్లు ఆమె మాట తీరును బట్టి తెలుస్తుంది. మొత్తానికి ఆ వ్యక్తి పట్ల సదరు మహిళ ప్రవర్తించిన తీరుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున ట్వీట్లు చేస్తుండగా.. ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్‌లో హ్యాష్‌ ట్యాగ్‌ కొనసాగుతోంది. ఇంతకు అక్కడ ఏం జరిగింది అనే విషయం గురించి పోలీసులు ఆరా తీయాల్సిన ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment