వీడియో వైరల్: బావిలో పడిన తన బిడ్డ కోసం ఆ కోతి చేసిన సాహసం చూస్తే.. హ్యాట్సాఫ్ అంటారు..

September 16, 2021 12:45 PM

తల్లి ప్రేమ అనేది ఎవరిలోనైనా ఒకే విధంగా ఉంటుంది. అది జంతువులైనా, పక్షులైనా, మనుషులు అయినా జాతి మారినప్పటికీ తల్లిప్రేమ మాత్రం మారదు. తన బిడ్డలను రక్షించుకోవడం కోసం ఎంతో ఆవేదన చెందుతూ తనబిడ్డ సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. ఇక తన బిడ్డకు ఏదైనా ఆపద వస్తే తల్లి తన ప్రాణాలను అడ్డుగా వేసి తన బిడ్డ ప్రాణాలను రక్షించుకుంటుంది. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో వైరల్: బావిలో పడిన తన బిడ్డ కోసం ఆ కోతి చేసిన సాహసం చూస్తే.. హ్యాట్సాఫ్ అంటారు..

ఈ వీడియోలో ఒక కోతి బావి గట్టున నిలబడి ఎంతో కంగారుగా బావిలోకి చూస్తూ గట్టుపై చక్కర్లు కొడుతోంది. అయితే తనపిల్ల బావిలో పడటంతో తన పిల్లలను ఎలా రక్షించుకోవాలని ఈ తల్లికోతి ఎంతో కంగారు పడుతోంది. ఎలాగైనా తన బిడ్డ ప్రాణాలను రక్షించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి తను చేసే సాహసం ప్రమాదం అని తెలిసినప్పటికీ తన ప్రాణాలను అడ్డువేసి తన బిడ్డ ప్రాణాలను కాపాడాలని ప్రయత్నించింది.

ఈ క్రమంలోనే తల్లి కోతి బావి గట్టును పట్టుకొని బావి లోపలికి తన తోకను వేలాడదీయడంతో పిల్లకోతి తన తల్లి తోకను పట్టుకొని పైకి ఎక్కుతూ బావిగట్టు చేరుకుంది. ఇలా తన ప్రాణాలను అడ్డు వేసి తన బిడ్డ ప్రాణాలను కాపాడిన కోతిని చూస్తే తల్లి ప్రేమకు ఎవరైనా ఫిదా కావాల్సిందేనని ఈ వీడియో చూస్తే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment