వైరల్: మాస్క్ వేసుకోలేదని అడిగితే.. మా ఆయనకు ముద్దిస్తా ఆపుతావా?

April 20, 2021 12:10 PM

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ మహమ్మారిని అదుపు చేయవచ్చు.అయితే ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రోజుకు కేసుల సంఖ్య అధికమవుతున్నాయి.

తాజాగా ఢిల్లీ వీధులలో ఓ జంట కరోనా నిబంధనలను ఉల్లంఘించి కారులో షికార్లు కొట్టారు. కనీసం మాస్కు కూడా ధరించకుండా కారులో వెళ్తున్న ఆ జంటను పోలీసులు ఆపి ఇదేమిటని ప్రశ్నించారు. ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 4 ఈ సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆ జంట పోలీసులపై ఎదురు దాడికి దిగారు. నా కారు ఎందుకు ఆపారు? నా భార్యతో నేను కారు లోపల ఉన్నా అంటూ సదరు వ్యక్తి పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు.

https://youtu.be/p556O0FNjGY

ఇకపోతే అతని భార్య నా భర్తకు ఇప్పుడు ముద్దిస్తా.. నన్ను ఆపుతావా? అంటూ పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది. ఈ క్రమంలోనే పోలీసులు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వారికి తెలియజేస్తున్న నేపథ్యంలో వారు పట్టించుకోకుండా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఓ మహిళా కానిస్టేబుల్ అక్కడకు చేరుకొని సదరు మహిళను సమీప పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment