వీడియో వైరల్: ఒక ఎండ్రకాయను చుట్టుముట్టిన 5 సింహాలు.. చివరికి ఏమైందంటే?

July 1, 2021 7:19 PM

సాధారణంగా సింహం ఒక జంతువు లేదా మనిషి పై దృష్టిసారించింది అంటే కచ్చితంగా ఆ రోజు సింహానికి ఆహారం కావాల్సిందే. మృగరాజుగా పేరుపొందిన సింహం ఎదురుపడితే మనం భయంతో ఎంతో గజగజ వణికి పోతాము. ఇక మన ప్రాణాలు పై కూడా ఆశలు వదులు పెట్టుకుంటాము.కానీ ఒకటి కాదు ఐదు సింహాలు చుట్టుముట్టినా కూడా ఏమాత్రం భయం లేకుండా తన పని తాను చేసుకు పోతున్న ఓ ఎండ్రకాయకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఇసుక లో నుంచి ఒక ఎండ్రకాయ బయటకు వచ్చింది. అయితే దానిని చూసిన ఓ సింహం దానిని ఏమి అనకుండా ఆ ఎండ్రకాయను అనుసరిస్తూ వెళ్ళింది. ఈ క్రమంలోనే మరో నాలుగు సింహాలు వచ్చి ఆ ఎండ్రకాయను చుట్టుముట్టాయి. ఈ విధంగా 5 సింహాలు తనని రౌండప్ చేసిన ఎండ్రకాయ ఏ మాత్రం భయపడకుండా తన పని తాను చేసుకుంటోంది.

ఈ ఐదు సింహాలు కలిసి ఎండ్రకాయను ఏం చేద్దాం అనుకుంటున్నాయో తెలియదు గానీ ఈ వీడియో మాత్రం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మాలా ప్రైవేట్‌గేమ్‌ రిజర్వ్‌కు చెందిన రేంజర్స్‌ రగ్గిరో బారెటో, రాబిన్ సెవెల్ తమ కెమెరాలో​ బంధించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోలో చివరగా ఐదు సింహాలు తనని చుట్టుముట్టడంతో ఈ వీడియో ముగుయడంతో ఈ వీడియో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment