బైక్‌పై ఎదురెదురుగా కూర్చుని జంట ప్ర‌యాణం.. గొడ‌వ‌ప‌డ్డ గ్రామ‌స్థులు.. వీడియో..

August 6, 2021 9:46 PM

ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో అయితే ప‌బ్లిగ్గా ముద్దులు పెట్టుకున్నా ఎవ‌రూ ఏమీ అన‌రు, ప్ర‌శ్నించ‌రు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇలా చేస్తే ఇబ్బందికర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. స‌రిగ్గా ఆ జంట‌కు కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

couple ride on bike viral video

బీహార్‌లోని గ‌య జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో ఓ జంట రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ వాహ‌నంపై ప్ర‌యాణిస్తోంది. భ‌ర్త వెనుక భార్య కూర్చుని వాహ‌నంపై వెళితే ఇబ్బంది రాక‌పోయేది. కానీ భ‌ర్త ముందు ట్యాంకు మీద భార్య కూర్చుంది. ఆమె అతనికి ముద్దు పెట్టిన‌ట్లు ఎదురుగా కూర్చోవ‌డంతో వారు స్థానికుల దృష్టిని ఆక‌ర్షించారు. దీంతో కొంద‌రు వారిని వీడియో తీశారు.

https://youtu.be/V-PHVLed5yU

అయితే ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన ఆ దంప‌తులు త‌మ‌ను వీడియో ఎందుకు తీస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. అందుకు ఆ గ్రామ‌స్థులు వారితో గొడ‌వ‌ప‌డ్డారు. బైక్‌పై స‌రిగ్గా కూర్చుని ప్ర‌యాణించ‌కుండా అలా అస‌భ్యంగా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆ గ్రామ‌వాసులు వారితో గొడ‌వ ప‌డ్డారు. చివ‌ర‌కు గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో త‌మ ప‌రువు పోతుంద‌ని భావించిన ఆ దంప‌తులు ఆ గ్రామ వాసుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. దీంతో అంతా స‌ద్దుమ‌ణిగింది. అయితే వారు అలా బైక్‌పై వెళ్తున్న వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment