జెండా ఎగరేసి సెల్యూట్ చేస్తూ మృతి చెందిన కాంగ్రెస్ నేత.. షాక్ లో కార్యకర్తలు!

August 16, 2021 4:48 PM

ఆగస్టు 15న దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో సంతోషంగా దేశ భక్తిని చాటుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాజకీయనాయకులు జెండా ఎగురవేసి జాతీయ పతాకానికి వందనం చేశారు. ఈ విధంగా దేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటూ ఆనందంలో ఉండగా జార్ఖండ్ ధన్‌బాద్‌లో మాత్రం అవి విషాదం అయ్యాయి. అక్కడి కాంగ్రెస్ నేత అన్వర్ హుస్సేన్ జండా వందనం చేస్తూ ఉన్నఫలంగా కుప్పకూలిపోయారు.

 

అప్పటివరకు స్వాతంత్ర దినోత్సవం చరిత్ర గురించి మాట్లాడిన ఆయన జెండా ఎగురవేసి జెండాకు సెల్యూట్ చేస్తూ అక్కడే కుప్పకూలి పోవడంతో ఏం జరిగిందో తెలియక కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని హుటాహుటిన కాంగ్రెస్ నేతను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కాంగ్రెస్ నేత అన్వర్ హుస్సేన్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

చిర్కుండా బ్లాక్ అధ్యక్షుడుగా. ఉన్న అన్వర్ హుస్సేన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కూలిపోయే మృతి చెందినట్లు తెలియడంతో చిర్కుండా బ్లాక్ లో విషాదఛాయలు అలుముకున్నాయి అప్పటివరకు ఆనందంలో ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment