నీటిలో దూకి మొస‌లిని ప‌ట్టుకున్న చిరుత‌.. త‌రువాత ఏం జ‌రిగింది..? వైర‌ల్ వీడియో..!

April 12, 2021 6:14 PM

చిరుత‌పులి, మొస‌లి.. రెండూ క్రూర మృగాలే. అవి చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి. వాటి ద‌గ్గ‌రకు వెళితే అంతే సంగ‌తులు. అయితే ఈ రెండూ ఎదురుప‌డితే ఎలా ఉంటుంది ? రెండింటిలో ఏది గెలుస్తుంది ? అంటే ఈ వీడియో చూడాల్సిందే.

cheetah vs crocodile who win the battle viral video

నీటిలో ఉన్న ఓ మొస‌లిపై చిరుత‌పులి అమాంతం దాడి చేసింది. దాన్ని నోట క‌రుచుకుని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చింది. దీంతో మొస‌లి ఆ పులి నుంచి త‌ప్పించుకునే య‌త్నం చేసింది. అయిన‌ప్ప‌టికీ చిరుత వ‌దిలిపెట్ట‌లేదు. దాన్ని ప‌క్క‌నే ఉన్న పొద‌ల్లోకి లాక్కెళ్లింది. ఆ స‌మ‌యంలో తీసిన ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ ప్ర‌వీణ్ అంగుసామి ఆ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేయ‌గా దాన్ని ఇప్ప‌టికే చాలా మంది వీక్షించారు. చాలా డేంజ‌ర‌స్‌గా ఉంది ఆ వీడియో.. అంటూ చాలా మంది యూజ‌ర్లు కామెంట్లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆ వీడియోను నెటిజన్లు షేర్ కూడా చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment