సాధారణంగా మనం ఎక్కడైనా మంటలు వ్యాపిస్తే వెంటనే నీటి కోసం వెతికి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తాము. మరికొందరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేస్తారు.అదేవిధంగా మరికొందరు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ మాత్రం కంగారు పడకుండా తన తెలివితేటలతో ఎంతో చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కరిస్తారు. అచ్చం ఈ మందు బాబు కూడా సమస్యను అలాగే పరిష్కరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
బవేరియాలోని హెస్బాచ్ పట్టణంలో నివసిస్తున్న ఓ వ్యక్తి బీరు బాటిళ్లును కొనుగోలు చేశాడు. మార్గమధ్యంలో అతనికి కార్ ఇంజన్ వేడెక్కడంతో ఉన్నపళంగా కారులో మంటలు వ్యాపించాయి. అయితే ఈ విధంగా మంటలు వ్యాపించడంతో అతను ఏమాత్రం కంగారు పడకుండా తన కారులో ఉన్నటువంటి బీర్ బాటిల్ ద్వారా మంటలను అదుపు చేశాడు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునిలోపు సమస్యను పరిష్కరించారు. బీరు పోయడం వల్ల మంటలు అధికమౌతాయి అనే సందేహం మీకు కలగొచ్చు..
సాధారణంగా ఏదైనా మంటలు వ్యాపించినప్పుడు ఆల్కహాల్ వేస్తే మంటలు అధికమవుతాయి. కానీ బీరు లో 90 శాతం నీరు ఉండటం వల్ల దీనికి మంటలను అదుపుచేసే గుణం ఉంటుంది. దీంతో ఆ వ్యక్తి తన కారులో వ్యాపించిన మంటలను అదుపు చేయడానికి బీరును ఉపయోగించాడని తెలియడంతో అతనిపై నెటిజన్లు ఏం తెలివి గురూ మీది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…