సింహాన్ని గాల్లోకి ఎత్తి కింద ప‌డేసిన గేదె.. వైర‌ల్ వీడియో..!

April 10, 2021 12:59 PM

సాధు జంతువుల‌ను స‌హ‌జంగానే క్రూర మృగాలు వేటాడుతాయి. అది స‌హ‌జ‌మే. ప్ర‌కృతి ధ‌ర్మం. అయితే ఇందుకు వ్య‌తిరేకంగా జ‌రిగితే ఎలా ఉంటుంది ? అబ్బే.. అస‌లు అది జ‌రుగుతుందా ? సాధు జంతువులు క్రూర మృగాల‌ను ఎక్క‌డైనా వేటాడుతాయా ? అంటే.. అవును.. వేటాడుతాయి. కోపం వ‌స్తే అవి ఊరుకోవు. ఎదుట ఎంతటి క్రూర మృగం ఉన్నా స‌రే ఎత్తి కింద ప‌డేస్తాయి. స‌రిగ్గా ఆ గేదెలు కూడా ఇలాగే చేశాయి.

buffalo lifted lioness and dropped down from air viral video

రెండు గేదెలు ఒక చోట నిల‌బ‌డి ఉండ‌గా వాటి ఎదురుగా ఇంకో గేదె కూర్చుని ఉంది. కూర్చుని ఉన్న గేదె వెనుక నుంచి ఓ ఆడ సింహం దానిపై దాడి చేసేందుకు య‌త్నించింది. అయితే ఎదురుగా నిలుచుని ఉన్న గేదెల్లో ఒక గేదె వేగంగా వ‌చ్చి ఆ సింహాన్ని త‌న కొమ్ముల‌తో గాల్లోకి ఎత్తి కింద ప‌డేసింది. అలా ఆ గేదె రెండు సార్లు చేసింది. దీంతో ఆ సింహం బ‌తుకు జీవుడా.. అంటూ అక్క‌డి నుంచి పారిపోయింది. ఈ దృశ్యాల‌ను కొంద‌రు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.

https://twitter.com/Darksidesnature/status/1380085370860171265

ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌బ‌డిన ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దాన్ని ఇప్ప‌టికే చాలా మంది చూశారు. ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. దానికి ర‌క ర‌కాల కామెంట్లను కూడా పెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment