ప్రియుడి పెళ్లి.. వధువుతోపాటు పెళ్లి పీటలపై కూర్చున్న ప్రియురాలు.. చివరికి ఏం జరిగిందంటే ?

July 30, 2021 5:37 PM

సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు అంటే పెద్దల అంగీకారంతో వారు వివాహం ద్వారా ఒకటవుతారు. లేదంటే విడివిడిగా ఎవరి జీవితం వారు చూసుకుంటారు.ఈ విధంగానే గతంలో ప్రేమించిన తన ప్రియుడు వివాహం జరగబోతుందని తెలుసుకున్న యువతి ఏకంగా పెళ్లి సమయానికి పెళ్లి పీటల పై కూర్చుని తనని పెళ్లి చేసుకోవాలని చెప్పిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండోనేషియాలోని లాంబాక్ తెంగాకు చెందిన 20 ఏళ్ల యువతి నూర్ ఖుస్నాల్ కొటిమాకు తన పెళ్లి రోజు ఒక చేదు అనుభవం ఎదురైంది. కొరిక్ అక్బర్ అనే యువకుడితో నూర్ వివాహం నిశ్చయమైంది.ఈ క్రమంలోనే తన పెళ్లి విషయం గురించి అక్బర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తన స్నేహితులతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే అక్బర్ మాజీ ప్రియురాలు ఈ విషయాన్ని చూసి పెళ్లి తేదీని రాసి పెట్టుకుంది.

ఈ క్రమంలోనే అతని పెళ్లిరోజు అక్బర్ మాజీ ప్రియురాలు యునితా పెళ్లి మండపానికి వెళ్లి వధువు పక్కన కూర్చుని తనని కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పింది. ఈ విధంగా పెళ్లి పీటలపై కూర్చుని ఉన్న ప్రియురాలిని చూసి అక్బర్,నూర్ కుటుంబం ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తన మాజీ ప్రియురాలు అడిగిన కోరికను తీర్చడానికి సిద్ధమైన అక్బర్ మాటలు విని ఎంతో షాక్ అయింది. ఈ క్రమంలోనే పెళ్లిమండపంలో గందరగోళ వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ తర్వాత ఇరు కుటుంబాల వారు వధువు నూర్ తో పాటు, మాజీ ప్రియురాలు యునితాని వివాహం చేసుకోవడానికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో అక్బర్ వీరిద్దరినీ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment