బైక్ పై వెళ్తున్న వారి మీద‌కు దూసుకొచ్చిన ఎలుగుబంటి.. వైర‌ల్ వీడియో..!

June 24, 2021 5:13 PM

ఆస‌క్తిక‌ర‌మైన వీడియోల‌ను, వార్త‌ల‌ను షేర్ చేయ‌డంలో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా అలాంటి ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన వీడియోను షేర్ చేశారు. ఆయన తన ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

bear came fastly towards bike viral video

ఇద్ద‌రు వ్య‌క్తులు బైక్ మీద త‌మిళ‌నాడులోని నీల‌గిరి ప‌ర్వ‌త ప్రాంతంలోని రోడ్డులో వెళ్తుండ‌గా వారికి రోడ్డు మ‌ధ్య‌లో మూడు ఎలుగు బంట్లు క‌నిపించాయి. అయితే వారు బైక్ మీదే వాటికి ఇంకొంచెం ద‌గ్గ‌ర‌గా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో ఆ మూడు ఎలుగుబంట్ల‌లో ఒక‌టి వారి గ‌మ‌నించి ఒక్క సారిగా బైక్ వ‌ద్ద‌కు దూసుకొచ్చింది. దీంతో వారు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఆ త‌రువాత ఏం జ‌రిగిందో వీడియోలో రికార్డు కాలేదు. కానీ చివ‌రి వ‌ర‌కు చూస్తే థ్రిల్ క‌ల‌గ‌డం ఖాయం.

ఆనంద్ మ‌హీంద్రా ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే దానికి 52వేల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాలో చాలా మంది ఆ వీడియోను చూసి థ్రిల్‌గా ఫీల‌వుతున్నారు. వీడియోను చివ‌రి వ‌ర‌కు చూస్తే షాక్ త‌గ‌ల‌డం ఖాయం అని చాలా మంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment