అదృష్టం అంటే ఇదే.. తాగిన బార్ నుంచే రూ.40 కోట్ల నష్ట పరిహారం రాబట్టిన తాగుబోతు.. ఎలాగంటే?

August 18, 2021 3:15 PM

కొన్నిసార్లు కొంతమందికి అదృష్టం సుడి తిరిగినట్టు తిరుగుతుంటుంది. ఇలా అదృష్టం పట్టినప్పుడు వారికి తెలియకుండానే లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారిపోతుంటారు. ఇలాంటి అదృష్టం తాజాగా ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. విచిత్రమేమిటంటే ఎక్కడైతే తను తప్పతాగి పడిపోయాడో ఆ బార్ నుంచి ఏకంగా రూ.40 కోట్ల నష్టపరిహారాన్ని రాబట్టిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళ్తే..

2019 మే నెలలో టెక్సాస్‌కు చెందిన డానియల్‌ రాల్స్ అనే వ్యక్తి ఒక రోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్‌ గ్రిల్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఫుల్‌గా తాగాడు. తాగిన మత్తులో ఆ వ్యక్తి కార్ పార్కింగ్ వద్ద మరో వ్యక్తితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే డానియల్ తలకు తీవ్రంగా గాయమైంది. ఈ విధంగా గాయపడిన డానియల్ ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం సదరు బార్ అండ్ రెస్టారెంట్ పై కోర్టులో కేసు వేశాడు. కేవలం ఆ రెస్టారెంట్ నిర్లక్ష్యం కారణంగానే ఈ విధమైనటువంటి గాయం తగిలిందని ఆరోపించాడు.

రెస్టారెంట్ సిబ్బంది తనకు అధికమొత్తంలో మందు తాపించి ఈ గొడవకు కారణం అయ్యారని, గొడవ పడుతున్న సమయంలో రెస్టారెంట్ యాజమాన్యం ఏ విధంగానూ స్పందించకపోవడమేకాకుండా, తలకు గాయంతో బాధపడుతుంటే అంబులెన్స్ కు కూడా ఫోన్ చేయలేదని ఆరోపించాడు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ యాజమాన్యం కూడా న్యాయవాదులను పెట్టి కోర్టులో వాదించినప్పటికీ కోర్టు మాత్రం డానియల్ కి అండగా నిలబడింది. ఈ క్రమంలోనే సదరు బార్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రవర్తించిన కారణంగా డానియల్ కు ఐదు మిలియన్ల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ విధంగా తీర్పు రావడంతో డానియల్ దశ మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పలువురు నెటిజన్లు లక్ష్మీ పుత్రుడు అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment