Zodiac Signs : ఏ రాశి వారికి ఎలాంటి బ‌ల‌హీన‌త‌లు ఉంటాయో తెలుసా..?

June 22, 2023 3:15 PM

Zodiac Signs : రాశులని బట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మొత్తం 12 రాశులు. అయితే ఈ రోజు ఏ రాశి వారి బలహీనత ఏంటి అనేది తెలుసుకుందాం.. మేష రాశి వారు చుట్టూ జరిగే విషయాలను గమనిస్తారు నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పక్కన ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందిస్తారు మేష రాశి వాళ్ళు.

వృషభ రాశి వాళ్లు నమ్మదగిన వ్యక్తుల్లా ఉంటారు వీళ్ళల్లో స్థిరత్వం ఎక్కువ ఉంటుంది ఏ పని చేయడానికి అయినా సరే ధైర్యం చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మిధున రాశి వాళ్ల మనసు నిలకడగా ఉండదు. ఎలా మారిపోతుందో ఎవరికీ కూడా తెలియదు. కర్కాటక రాశి వారి బలహీనత విషయానికి వస్తే వీరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయానికి కూడా నిరాశ పడిపోతారు. సింహరాశి వాళ్ళకి గర్వము, అహంకారం ఎక్కువగా ఉంటుంది.

Zodiac Signs and their weaknesses of persons
Zodiac Signs

ఇక కన్యా రాశి వాళ్ల విషయానికి వస్తే వీళ్ళకి మేధస్సు ఎక్కువ ఎలాంటి సమస్య ని అయినా సరే వీళ్ళు పరిష్కరించగలుగుతారు. సమస్య దగ్గరకి వచ్చాక అయోమయం లో ఉంటారు. తులారాశి వాళ్ళకి షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది సహనాన్ని ఈజీగా కోల్పోతూ ఉంటారు. వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే సమస్యలు ఎక్కువ కలిగి ఉంటారు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇదే వీరి యొక్క బలహీనత. ధనస్సు రాశి వారికి ఓపిక సహనం చాలా తక్కువగా ఉంటుంది. అసలు వీళ్ళు వినరు. ఇదే వీరి యొక్క బలహీనత.

మకర రాశి వాళ్ళు డబ్బుకు విలువను ఎక్కువ ఇస్తారు డబ్బు కోసం బాగా కష్టపడతారు. చిన్న చిన్న సంతోషాలకి దూరమవుతారు. ఇదే వీరి యొక్క బలహీనత. కుంభరాశి వాళ్లు మనసులోని మాటల్ని బయటికి చెప్పడానికి ఇబ్బంది పడతారు భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి మనసులోని భావాలని బయటకు చెప్పడానికి భయపడి పోతారు. ఇదే వీళ్ళ బలహీనత. మీన రాశి వాళ్ళకి కూడా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఎక్కువగా వీళ్ళ యొక్క భావోద్వేగాలని బయటకి చెప్తూ ఉంటారు ఇదే వీళ్ళ యొక్క బలహీనత.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now