Sleep : ఉత్తరం వైపు తల పెట్టి ఎందుకు నిద్రపోకూడదు..? దీని వెనుక ఇంత కథ ఉందని తెలుసా..?

August 19, 2023 8:02 AM

Sleep : మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాల‌ను అనుసరించి మనం నిద్రపోతే చక్కటి ఫలితం కనబడుతుంది. అయితే ఎప్పుడైనా మీరు పండితులు చెప్పడాన్ని వినే ఉంటారు. ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదు అని. అయితే అసలు ఎందుకు ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదు..?, దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరం వైపుగా తల పెట్టుకుని నిద్రపోవడం వలన చెడు కలలు వస్తాయని, మనసుని దెబ్బతీసేలా ఉంటాయ‌ని అంటారు.

ఉత్తరం వైపు నిద్రపోతే పాజిటివ్ ఎనర్జీని కోల్పోతారు కూడా. పూర్వీకుల‌ నుండి కూడా ఇలా చెప్పడం జరుగుతోంది. అయితే ఉత్తరం వైపు తల పెట్టుకుని ఎందుకు నిద్రపోకూడదు అనే విషయానికి వచ్చేస్తే.. ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్ర పోవడం వలన సైంటిఫిక్ పరంగా చూసుకున్నట్లయితే, రక్తప్రసరణకి ఆటంకం అవుతుంది. నిద్రలో ఆటకం ఏర్పడుతుంది. కాబట్టి అలా నిద్రపోకూడదని అంటారు. ఎనర్జీ లెవెల్స్ కూడా ఉత్తరం వైపు నిద్రపోవడం వల్ల తగ్గిపోతాయి.

you should not Sleep while putting your head to north
Sleep

ఆధ్యాత్మికపరంగా చూసుకున్నట్లయితే పార్వతీ దేవి స్నానానికి వెళ్ళినప్పుడు గణపతిని తలుపు దగ్గర కాపలాగా పెడుతుంది. ఎవరినీ లోపలికి రాకుండా చూసుకోమని చెప్తుంది. వినాయకుడికి శివుడు పార్వతీ దేవి భర్త అని తెలిసినా శివుడిని లోపలికి వెళ్ళకుండా వినాయకుడు అడ్డుకుంటాడు. పార్వతీ దేవి బయటకి వచ్చేసరికి శివుడు, గణపతి గొడవ పడుతూ ఉంటారు.

శివుడికి కోపం వచ్చి వినాయకుడి తల నరికేస్తాడు. పార్వతీ దేవి ఆగ్రహానికి లోనై తన బిడ్డను తిరిగి కాపాడాలని మొండిపట్టు పడుతుంది. శివుడు ఆదేశించ‌గా అతని భటులు ఉత్తరం దిశగా నిద్రిస్తున్న జీవుల కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఒక ఏనుగుని చూస్తారు. ఆ ఏనుగు తల నరికి శివుడికి ఇస్తారు. ఇలా ఉత్తరం వైపు పడుకున్న వాళ్ళ తలని తీసుకున్నారని, ఇలా ఈ దిశలో పడుకోకూడదని చెప్తూ ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now