Stray Cat Visit To Your Home : సాధారణంగా మన దేశంలో పిల్లిని పెంచుకోవడం అపశకునంగా భావిస్తారు. నల్ల పిల్లి ఎదురైతే ఆ రోజంతా ఎంతో కీడు జరగబోతుందని భావిస్తారు. దీంతో చేయబోయే పనిని కూడా ఆపేస్తారు. అలాగే ఎక్కడికీ ప్రయాణాలు కూడా చేయరు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం నల్ల పిల్లి ఎదురైతే ఎంతో మంచిదని భావిస్తారు. అయితే పిల్లుల గురించి కొన్ని వర్గాలకు చెందిన వారు అనేక విశ్వాసాలను పాటిస్తారు. ముఖ్యంగా ప్రాచీన ఈజిప్షియన్లు పిల్లులను దైవ స్వరూపంగా భావించేవారు.
పిల్లులను ఒకప్పటి ఈజిప్షియన్లు ఇండ్లలో పెంచుకునేవారు. వాటిని దైవంగా భావించి పూజించేవారు. పిల్లులకు దుష్టశక్తులు కనిపిస్తాయని, కనుక అవి మన దగ్గర ఉంటే మన వద్దకు దుష్టశక్తులు రావని వారు భావిస్తారు. అందుకనే వారు పిల్లులకు అంత ప్రాధాన్యతను ఇచ్చేవారు. అయితే ఇప్పుడు చాలా మంది పిల్లులను పెంచడం లేదు. కానీ వీధుల్లో మాత్రం మనకు అప్పుడప్పుడు పిల్లులు కనిపిస్తుంటాయి. ఇవి ఎవరి ఇంట్లోకి పడితే వారి ఇంట్లోకి వెళ్లవు. కేవలం కొందరి ఇళ్లలోకే తరచూ వెళ్తుంటాయి. ఇక కొందరి ఇళ్లలోకి అయితే వీధి పిల్లులు సడెన్‌గా వచ్చేస్తుంటాయి. అయితే దీని వెనుక చాలా అర్థం ఉందని పండితులు చెబుతున్నారు.
వీధుల్లో తిరిగే పిల్లి ఏదైనా సడెన్‌గా మీ ఇంట్లోకి వచ్చిందంటే ఆ ఇంట్లోని వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని అర్థమట. ఆ పిల్లి వారికి ఏదో సందేశం ఇవ్వడం కోసమే అలా సడెన్‌గా ఇంట్లోకి వస్తుందట. ముఖ్యంగా ఇంటి యజమాని జీవితంలో అనేక మార్పులు వస్తాయట. దాన్ని తెలియజేయడం కోసమే కొన్ని సార్లు వీధుల్లో తిరిగే పిల్లులు మన ఇంట్లోకి సడెన్‌గా వస్తాయట.
ఇక అలా పిల్లి వచ్చినప్పుడు కుటుంబ యజమాని జీవితంలో ఎలాంటి మార్పు అయినా రావచ్చు. కానీ జీవితాన్ని మలుపు తిప్పే మార్పులు జరుగుతాయట. కనుక అలా గనక ఎవరి ఇంట్లోకి అయినా పిల్లి సడెన్‌గా వస్తే అప్పుడు ఆ ఇంటి యజమాని అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదు. అలాగే చేయబోయే పనుల విషయంలో కానీ లేదా ప్రయాణాల విషయంలో కానీ అత్యంత జాగ్రత్త తీసుకోవాలి. దీంతో జీవితంలో వచ్చే ఎలాంటి మార్పులను అయినా ముందే పసిగట్టి ఎదుర్కోవచ్చు. ఇందుకనే పిల్లలు కొన్ని సార్లు సడెన్‌గా మన ఇంట్లోకి వచ్చి ఈ విషయాన్ని గుర్తు చేస్తాయట. కనుక మీకు కూడా ఇలా జరుగుతుంటే జాగ్రత్తగా ఉండండి.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…