Sparrows : మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నాయా. దాని అర్థం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆ వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని సార్లు ఇంట్లోకి కొన్ని రకాల పక్షులు, జంతువులు వచ్చే స్తుంటాయి. అయితే ఇంట్లోకి ఏ పక్షులు రావడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియక భయపడుతుంటారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది అనేది మన పెద్దలు చెప్పే మాట. పిచ్చుకలు జంటగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కళ్యాణ యోగం ఉన్నట్లు చెబుతారు. ఒక వేళ ఆ ఇంట్లో కళ్యాణం జరిగిన వారు ఉంటే వాళ్ళకి సంతాన యోగం ప్రాప్తిస్తుందని చెబుతారు.
అలాగే చాలా మంది కాకిని అశుభంగా భావిస్తుంటారు. కానీ కాకి మన పితృదేవతలకు సూచనగా భావించాలి. కాకి ఎగురుతూ ఇంట్లోకి వస్తే పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్లు భావించాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు కాకి తల పైన తడితే ఏదో అశుభం జరగబోతోందని సూచన. అలాగే గుడ్లగూబను చూసి చాలా భయపడుతూ ఉంటారు. అయితే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం. ఎవరింట్లోకి అయినా గుడ్లగూబ వచ్చింది అంటే వారికి లక్ష్మీ యోగం పట్టబోతోందని అర్థం. అలాగే కొన్ని సార్లు ఇంట్లోకి పాములు వస్తుంటాయి. ఇలా దూరడం వల్ల ఆ ఇంట్లో మానసిక వ్యధ వస్తుందని అర్థం. కందిరీగలు ఇంట్లో గూడు కట్టుకుంటే చాలా మంచిదని చెబుతుంటారు. ఇలా కట్టుకోవడం వల్ల ధన యోగం ఉంటుందని ఆ కట్టిన మట్టితో బొట్టు పెట్టుకుంటే శరీరంలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా తొలగిపో తుందని చెబుతారు.
చాలా వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బల్లులు తిరుగుతూ నే ఉంటాయి. వీటిని చూసి మనం చాలా భయపడి పోతుంటాం. కానీ ఇవి గోడల పైన ఉండే క్రిమి కీటకాలను తిని మనకు మంచి చేస్తాయని చెబుతున్నారు. అలాగే వాస్తు పరంగా కూడా బల్లి ఇంట్లో ఉండడం చాలా మంచిదట. అలాగే పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంటాయి. ఇలా రావడం వల్ల కూడా మంచిదేనని చెబుతున్నారు. పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వస్తే మంచి జరగబోతోందని అర్థంగా భావించాలి. తేలు జెర్రి ఇంట్లోకి రావడం మంచిది కాదు. ఇలా వస్తే మీ ఇంట్లో శుభ్రత లోపించిందని, అనారోగ్య హేతువు అని భావించాలి. వెంటనే ఇంటిని శుభ్రపరచుకోవాలి.
అలాగే ఇంటి చుట్టూ పూల మొక్కలు ఉంటే సీతాకోకచిలుకలు ఇంట్లో కి వస్తూ వుంటాయి. సీతాకోకచిలుకలు ఇంట్లోకి రావడం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ యోగం కూడా పడుతుందని చెబుతున్నారు. లక్ష్మీ యోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, సంతోషం, మనశ్శాంతి, సంతానం వంటివి కూడా మనిషికి అవసరమైనవే. ఇంట్లో సంతోషంగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. ఒకరికి ఏదైనా ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు అదే నిజమైన ఘనతగా భావించాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…