Peacock Feather : వాస్తు దోషాలు, శ‌ని బాధ‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. నెమ‌లి ఫించాన్ని ఇలా పెట్టండి..!

August 17, 2023 10:06 AM

Peacock Feather : చాలామంది మంచి జరగాలని అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. దోషాలను తొలగించుకోవాలని, మంచి జరగాలని, నష్టాలు కలగకూడదని వివిధ రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అయితే దోషాలను తొలగించడానికి, అదేవిధంగా ఇంకొన్ని లాభాలని తీసుకురావడానికి నెమలి ఈకలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. మరి నెమలి ఫించంతో ఎలాంటి దోషాలు తొలగిపోతాయి..? ఎటువంటి లాభాలను పొంద‌వ‌చ్చు అనేది చూద్దాం.

ఇంట్లో నెమలి ఫించాన్ని పెట్టడం వలన ఇల్లు చాలా అందంగా కనబ‌డుతుంది. అలంకరణగా వాడుకోవచ్చు. కేవలం ఇది ఒక్కటి మాత్రమే కాదు. నెమలి ఫించం వలన అనేక రకాల దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో వాస్తు సమస్యలు దూరం అవుతాయి. మూడే నెమలి ఫించాలని తీసుకుని నలుపు దారంతో కట్టేయండి. తర్వాత కొంచెం వక్కపొడి చల్లి నీళ్లను చిలకరించండి ఆ తర్వాత ఓం శనీశ్వరాయ నమః అని 21 సార్లు జపించాలి. ఇలా చేయడం వలన శని దోషం తొలగిపోతుంది.

put Peacock Feather in this way in your home for luck and money
Peacock Feather

వాస్తు దోషాలు తొలగి పోవాలంటే ఎనిమిది నెమలి ఫించాలని తీసుకుని అన్నింటినీ తెలుపు రంగు దారంతో కట్టేయండి. ఇప్పుడు ఓం సోమాయ నమః అని జపించండి. అంతే వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో డబ్బులు దాచే చోటు వద్దకు వెళ్లి, నెమలి ఫించాన్ని పెట్టండి. ఇక సంపద వద్దన్నా వస్తుంది. శ్రేయస్సు పెరుగుతుంది. డబ్బుని బాగా ఆకర్షిస్తుంది. నెమలి ఫించాన్ని ఇంట్లో పెట్టడం వలన వాస్తు దోషాలు తొలగడమే కాకుండా నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి.

ఆఫీసులో కూడా నెమలి ఫించాలని పెట్టుకోవచ్చు. నెమలి ఫించం పెయింటింగ్ పెట్టుకుంటే కూడా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరు. ఆరోగ్యం, శ్రేయస్సును కూడా నెమలి ఫించం తీసుకొస్తుంది. పడక గదిలో కనుక నెమలి ఫించం పెట్టుకున్నట్లైతే భార్యాభర్తల మధ్య బంధం మెరుగుపడుతుంది. అర్థం చేసుకునే గుణం అలవాటు అవుతుంది. ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా పెడితే చెడు తొలగిపోతుంది. మంచి జరుగుతుంది. ఇలా ఈ విధంగా మీరు ఆచరించడం వలన అంతా శుభమే జరుగుతుంది. సమస్యల నుండి దూరంగా ఉండ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment