ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం గుర్రాలు శక్తికి ప్రతిరూపం. ఇవి ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందువల్ల ఇల్లు లేదా ఆఫీస్‌లో గుర్రాల బొమ్మలను పెట్టుకుంటే అదృష్టం కలసి వస్తుంది. చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇంట్లో అయితే ధనం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల గుర్రపు బొమ్మలను పెట్టుకుంటే వాస్తు ప్రకారం ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఇల్లు లేదా ఆఫీసులో దక్షిణ దిశలో గుర్రపు బొమ్మను ఉంచాలి. దీంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. బిజినెస్‌లో చేపట్టే పనులు విజయవంతమవుతాయి. ధనం కలుగుతుంది.
* ఇల్లు లేదా ఆఫీస్‌లో ఉత్తర దిశలో గుర్రపు బొమ్మను ఉంచితే కెరీర్ పరంగా సెట్ అవుతారు. ఆ సమస్యలు ఎదుర్కొనేవారు, ఆర్థిక సమస్యలు ఉన్న వారు గుర్రపు బొమ్మను ఉత్తర దిశలో పెట్టాలి. దీంతో లక్ కూడా కలసి వస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి.
* తలుపులు లేదా కిటికీలకు ఎదురుగా గుర్రపు బొమ్మ తల వచ్చేలా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి.
* రెండు జంట గుర్రపు బొమ్మలను బెడ్ రూంలో పెట్టుకుంటే దంపతుల మధ్య కలహాలు ఉండవు. గొడవలు లేని కాపురంతో వారు సుఖంగా జీవిస్తారు. బెడ్‌రూంలలో ఎప్పుడు ఒంటరి గుర్రపు బొమ్మలను పెట్టరాదు. జంట గుర్రపు బొమ్మలనే పెట్టుకోవాలి.
* ఇక గుర్రపు బొమ్మనే పెట్టుకోవాల్సిన పనిలేదు. గుర్రం ఫొటోను ఇల్లు లేదా ఆఫీస్ లో వేలాడదీసినా పైన చెప్పిన ఫలితాలు కలుగుతాయి.
* ఏడు గుర్రాలు పక్క పక్కనే పరిగెడుతున్నట్టుగా ఉండే ఫొటో లేదా విగ్రహాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. దీంతో ఇల్లు లేదా ఆఫీస్‌లో ఉండే నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. సమస్యలు ఏవైనా ఉంటే ఇట్టే పరిష్కారం అయిపోతాయి.
* పగ్గాలతో ఉండే గుర్రపు బొమ్మలను మాత్రమే పెట్టాలి. ఒంటిపైన ఏమీ లేని ఖాళీ గుర్రపు బొమ్మలను పెట్టరాదు. పెడితే అవి నెగెటివ్ ఎనర్జీకి సంకేతాలు కనుక అదే ఎనర్జీ ప్రసారమవుతుంది. దీంతో అదృష్టం కలసి రాదు. కనుక పగ్గాలు లేదా జీనుతో ఉండే గుర్రపు బొమ్మలనే పెట్టాల్సి ఉంటుంది. దీంతో లక్ కలసి వస్తుంది. అంతా మంచే జరుగుతుంది. అన్నింటా వృద్ధిలోకి వస్తారు. సంపదలు సిద్ధిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…