జ్యోతిష్యం & వాస్తు

Lucky : అదృష్టవంతులైన వారు ఏ నెలలో పుడతారు..?

Lucky : కొంతమంది పుట్టగానే వారిని అదృష్టం వరిస్తుంది. అలాగే కొందరు పేదరికంలోనే పుడతారు. కానీ తరువాత డబ్బు సంపాదిస్తారు. ఇక కొందరు డబ్బులో పుట్టినా తరువాత దాన్ని పోగొట్టుకోవచ్చు. విధి అనేది ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలాగా ఉంటుంది. అయితే మనం ఈ జన్మలో అనుభవించేదంతా క్రితం జన్మలో చేసిన పాపమో లేదా పుణ్య ఫలమో అయి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. క్రితం జన్మలో పాపం చేస్తే ఈ జన్మలో అన్నీ కష్టాలనే అనుభవిస్తామట. అలాగే పూర్వ జన్మలో ఏదైనా పుణ్యం చేసినా.. మంచి పనులు చేసినా.. అందుకు తగిన ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తామట. అందుకనే కొందరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏం చేసినా కలసి వస్తుంది. మిక్కిలిగా ధనం సంపాదిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

ఇక మనం జన్మించే నెలను బట్టి కూడా మన జీవిత ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ నెలలో పుట్టిన వారు ఏం చేస్తారో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో, డబ్బు సంపాదిస్తారో లేదో.. ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి నెలలో పుట్టిన వారు సున్నితమైన మనసును కలిగి ఉంటారట. వీరికి తెలివి తేటలు అధికంగా ఉంటాయట. ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు చదువుల్లో ప్రతిభను కనబరుస్తారట. తెలివితేటలను కలిగి ఉండడంతోపాటు కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారట.

Lucky

మార్చి నెలలో పుట్టిన వారు కాస్త గర్వం కలిగి ఉంటారట. రాజకీయాల్లో రాణిస్తారట. వీరు ఆలోచనా శక్తిని కలిగి ఉంటారట. ఏప్రిల్‌ నెలలో పుడితే వారికి కోపం అధికంగా ఉంటుంది. కానీ చురుగ్గా ఉంటారు. తెలివితేటలు, ధైర్యం కలిగి ఉంటారు. మే నెలలో పుట్టిన వారు ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తారు. త్యాగబుద్ధి ఉంటుంది. ఓర్పుగా ఉంటారు. జూన్‌ నెలలో పుట్టిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. పదునైన మెదడు ఉంటుంది. కానీ తొందరపాటు ఎక్కువ. ఏ విషయంలో అయినా చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారు.

జూలైలో పుట్టిన వారు పారిశ్రామిక వేత్తలుగా మారుతారు. వీరికి అదృష్టం ఎక్కువే. ఆగస్టులో పుట్టిన వారు తమ స్వయం శక్తితో ఎదుగుతారు. సమాజంలో గౌరవం ఉంటుంది. సమయస్ఫూర్తితో రాణిస్తారు. సెప్టెంబర్‌లో పుట్టిన వారు చురుగ్గా ఉంటారు. కానీ తొందరపాటు ఉంటుంది. తమ శ్రమను నమ్ముకుంటారు. అక్టోబర్‌లో జన్మించిన వారు శక్తివంతులుగా మారుతారు. వీరు అందరినీ ఆకర్షిస్తారు. నవంబర్‌లో పుట్టిన వారు పోరాడే గుణాన్ని కలిగి ఉంటారు. ధైర్యం ఎక్కువే. కోరికలు కూడా ఎక్కువే. చురుగ్గా ఉంటారు. డిసెంబర్‌లో పుట్టిన వారు ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారు. ఇతరుల పట్ల ప్రేమను చూపిస్తారు. జాలి, దయ కలిగి ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM