Gruha Pravesham : సొంత ఇంటిని కట్టుకోవాలని చాలా మందికి కల ఉంటుంది. అందుకోసమే చాలా మంది కష్టపడుతుంటారు. సొంతంగా ఇల్లు కాకపోయినా అపార్ట్‌మెంట్ అయినా తీసుకోవాలని చూస్తుంటారు. అయితే ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కట్టింది కొన్నా.. లేదా సొంతంగా కట్టించుకున్నా.. వాస్తుకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఇంట్లో అన్నీ దోషాలే ఏర్పడుతాయి. దీంతో అలాంటి ఇంట్లో నివసించే వారు అన్నీ సమస్యలనే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దీంతోపాటు కొత్త ఇంటికి గృహ ప్రవేశం చేసే సమయంలోనూ కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఇంటిని కొత్తగా నిర్మిస్తున్నట్లే లేదా కట్టిన ఇంటిని తీసుకుంటే ఇంటి ప్రధాన ద్వారం ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోండి. అలా వీలు కుదరకపోతే ఇంటి ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉండేలా చూడండి. దీంతో వాస్తు దోషాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇక గృహ ప్రవేశం చేసే వారు తగిన తేదీ, ముహుర్తాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కుటుంబ యజమాని జాతకంతో ముహుర్తం చూడాల్సి ఉంటుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ల పక్షంలోని గురువారం లేదా శుక్రవారం, ఆదివారం గృహ ప్రవేశం చేయడం చాలా మంచిదని చెబుతుంటారు. అయితే కచ్చితమైన సమయం లేదా ముహుర్తం కోసం పండితులను సంప్రదిస్తే మంచిది.
కొత్త ఇంట్లోకి ప్రవేశించిన తరువాత పాలు పొంగిస్తారు. దీంతో ఆ ఇంట్లో సిరి సంపదలు, ధనధాన్యాలు తులతూగాలని కోరుకుంటారు. అలాగే కచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరించాలి. దీని వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో ఉండబోయే వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సమస్యల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఇంటిని కొనే ముందు లేదా కట్టించేటప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించి వాస్తు సలహాలను తీసుకోవడం ఉత్తమం.
ఇక ఇంటి లోపల, బయట పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ ఆ ఇంటి మహిళలు ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఆ ఇంట్లో ఉండే వారిని అనుగ్రహిస్తుంది. దీంతోపాటు వాస్తు దోషాలు కూడా పోతాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. కనుక కొత్త ఇంట్లో చేరబోయే వారు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. లేదంటే సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…