Nightmares : ప్రపంచమంతా నేడు చాలా వేగంగా ముందుకు కదులుతోంది. దీంతో మనకు అన్ని పనులను చక్క బెట్టుకునేందుకు రోజులో 24 గంటలు సరిపోవడం లేదు. అంత బిజీగా మనం పనులు చేసుకుంటున్నాం. అలా బిజీలో పడిపోయి నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. రోజుకు కనీసం 8 గంటలు కాదు కదా, 6 గంటలు కూడా నాణ్యమైన నిద్ర పోవడం లేదు. పని ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా చాలా మందిని నిద్ర లేమి ఇబ్బందులకు గురి చేస్తోంది. ఫలితంగా అది లైఫ్ స్టైల్ వ్యాధులకు దారి తీస్తోంది. అయితే కింద మేం చెప్పిన పలు సూచనలు పాటిస్తే దాంతో నిద్ర చక్కగా పోవచ్చు. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని యాలకులు తీసుకుని ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి ఆ వస్త్రాన్ని మీ దిండు పక్కనే పెట్టుకోండి. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. బెడ్‌పై పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. అంతేకాదు, ఇలా చేయడం వల్ల వాస్తు ప్రకారం పీడ కలలు రావట. చాలా హాయిగా నిద్రపోవచ్చట. దక్షిణం వైపు తల పెట్టి, ఉత్తరం వైపు కాళ్లు ఉంచి నిద్రిస్తే చక్కగా నిద్రపడుతుందట. వాస్తు ప్రకారం అనుకున్నవి నెరవేరుతాయట. లక్ కలసి వస్తుందట. నిద్ర పోయే ముందు కనీసం 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కళ్లు మూసుకుని ఏదైనా ఒక వస్తువుపైనే దృష్టి ఉంచాలి. ధ్యానం అంతా ఆ వస్తువుపైనే పెట్టాలి. మనస్సులోకి ఎలాంటి ఇతర ఆలోచనలను రానివ్వరాదు. దీంతో మనస్సు ప్రశాంతంగా, తేలికగా మారి చక్కగా నిద్ర పడుతుంది.
ఒక రాగి చెంబు లేదా పాత్ర, గ్లాస్‌లో పూర్తిగా నీటితో నింపాలి. అనంతరం దాన్ని దిండు పక్కనే టేబుల్‌పై పెట్టుకుని నిద్రించాలి. ఇలా చేయడం వల్ల చక్కగా నిద్రపడుతుంది. వాస్తు దోషం పోతుంది. పీడ కలలు రావు. అయితే ఇలా ఉంచిన నీటిని ఉదయం తాగరాదు. మొక్కలకు పోస్తే మంచిది. నిద్రించే బెడ్ పక్కనే చెప్పులు, బూట్లను వదలరాదు. అలాగే వాటిని పెట్టే ర్యాక్స్‌ను కూడా బెడ్ నుంచి దూరంగా ఉంచాలి. వాటిని బెడ్ పక్కనే పెట్టరాదు. పెడితే నెగెటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది. అది వాస్తు దోషాన్ని కలగజేయడమే కాదు, నిద్రకు భంగం కలిగిస్తుంది. పీడకలలు వస్తాయి. కనుక ముందు చెప్పిన విధంగా చిట్కాలను పాటిస్తే దాంతో నిద్ర త్వరగా పడుతుంది. అలాగే పీడకలలు రాకుండా ఉంటాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…