ఆరోగ్యం

Dandruff : చుండ్రు అధికంగా ఉందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ఎలాంటి స‌మ‌స్య అయినా త‌గ్గుతుంది..!

Dandruff : నేటి త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో చుండ్రు కూడా ఒక‌టి. అనేక కార‌ణాల వ‌ల్ల ఇది వ‌స్తుంది. ముఖ్యంగా కొంద‌రికి అయితే చుండ్రు బాధ మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చుండ్రును త‌గ్గించుకోవ‌డం కోసం అనేక మంది ర‌క ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను ట్రై చేస్తుంటారు. వాటిల్లో చాలా వ‌ర‌కు కృత్రిమమైన‌వే ఉంటాయి. దీంతో ఆ ప‌ద్ధ‌తుల్లో వాడే షాంపూలు, ఇత‌ర క్రీముల వ‌ల్ల వాటిల్లో ఉండే కెమిక‌ల్స్ జుట్టుకు మ‌రింత హాని క‌లిగిస్తాయి. క‌నుక అలాంటి ఇబ్బంది ప‌డ‌కుండా ఉండాలంటే కింద చెప్పిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తులను ట్రై చేయండి. దీంతో చుండ్రును మ‌రింత ఎఫెక్టివ్‌గా వ‌దిలించుకోవ‌చ్చు. మ‌రి చుండ్రు పోవాలంటే పాటించాల్సిన ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

ఒక పాత్ర‌లో 50 ఎంఎల్ మోతాదులో కొబ్బ‌రి నూనె తీసుకోవాలి. అందులో నాలుగైదు వేపాకులు వేసి ఆ ఆయిల్‌ను కొద్దిగా మ‌ర‌గ‌బెట్టాలి. అనంత‌రం దాన్ని అలాగే తీసుకుని గోరు వెచ్చ‌గా ఉండ‌గానే త‌ల‌కు అప్లై చేసి 30 నిమిషాల వ‌ర‌కు వేచి ఉండి ఆ త‌రువాత య‌థావిధిగా త‌ల‌స్నానం చేయాలి. దీంతో చుండ్రు బాధ నుంచి విముక్తి క‌లుగుతుంది. వారంలో క‌నీసం 3 సార్లు ఇలా చేస్తే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతుల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఆ మెంతుల‌ను తీసి పేస్ట్‌గా చేసి త‌ల‌కు ప‌ట్టించాలి. 15 నిమిషాలు ఆగాక త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు నుంచి విముక్తి క‌లుగుతుంది. అయితే మెంతుల పేస్ట్‌లో కొద్దిగా ఉసిరికాయ పొడి కూడా క‌లుపుకోవ‌చ్చు. దీంతో మ‌రింత ఎఫెక్టివ్‌గా ఫ‌లితం వ‌స్తుంది.

Dandruff

రైజిన్లు, బాదంప‌ప్పును తీసుకుని నీటిలో రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే వాటిని తినాలి. ఇలా రోజూ చేస్తే చుండ్రు బాధ ఉండ‌దు. శిరోజాలు కూడా ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తాయి. ధ‌నియాలు, సోంపు, తుల‌సి ఆకులు, ప‌సుపు, ఉసిరికాయ పొడిల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని మిశ్ర‌మంగా చేయాలి. దీన్ని మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నానికి ముందు 1 టేబుల్ స్పూన్ మోతాదులో సేవిస్తే చుండ్రు బాధ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గడుపున 1 టీస్పూన్ ఉసిరికాయ పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగినా చుండ్రు నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. కొత్తిమీర జ్యూస్‌లో చిటికెడు ప‌సుపు క‌లిపి రోజూ రెండు పూట‌లా తాగితే చుండ్రు త‌గ్గుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM