Vastu Tips : ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే చాలు.. అదృష్టం మీ వెంటే..!

August 23, 2023 7:30 PM

Vastu Tips : ప్రతి ఒక్కరూ కూడా అదృష్టం కలిగి సంతోషంగా జీవించాలని కోరుతూ ఉంటారు. అదృష్టం కలగాలంటే కొన్ని పొరపాట్లని అసలు చేయకూడదు. వీటిని కనక పాటించినట్లయితే అదృష్టం మీ వెనుకే వస్తుంది. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండవచ్చు. వాస్తు దోషాలు ఏర్పడడానికి కారణాలు చాలా ఉంటాయి. ఇంటి నిర్మాణానికి వాస్తు ఎంతో ముఖ్యం. వాస్తు ప్రకారం ఇంటిని కట్టుకోకపోతే అనేక బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు. దరిద్రం వస్తుంది.

సుఖసంతోషాలు ఏమీ కూడా ఉండవు. అందుకని కచ్చితంగా ఇంటి నిర్మాణానికి వాస్తు అనేది ఎంతో ముఖ్యం. సరిగ్గా వాస్తు ఉంటేనే కలకాలం లక్ష్మీదేవి మీ వెంట నిలుస్తుంది. వాస్తు దోషం ఉంటే తగిన పరిహారాల కోసం తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఈ పొరపాట్లను చేయకూడదు. ఇంటి ముఖ ద్వారం చాలా ముఖ్యమైనది. సౌందర్యంగా, ఆకర్షణీయంగా ఇంటి ముఖద్వారం ఉండాలి.

10 Vastu Tips for positive energy and luck
Vastu Tips

ఇంటి ముఖద్వారం కూడా సరైన దిశలో ఉండాలి. ఎప్పుడూ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి. ఇంటి గడప ముందు చెప్పులు, షూ వంటి వాటిని పెట్టకూడదు. సరైన మార్గంలో మాత్రమే వాటిని పెట్టాలి. ఇంట్లో కూజా, గాజు వస్తువులను పెట్టుకోకూడదు. వాస్తు లోపం ఉంటుంది. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

వంటగది శుభ్రంగా లేకపోతే, నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సూర్యోదయానికి ముందు ఇంటిని శుభ్రపరచుకోవాలి. తుడుచుకోవాలి. శరీరంపై ఎప్పుడూ సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి. ఇంటి లోపల ఈశాన్య దిశలో పూజ గదిని ఉంచుకోండి. దేవుడు విగ్రహాలని గోడ పక్కన పెట్టకూడదు. సాయంత్రం వేళ మొక్కలు, చెట్లని నరికేయకూడదు. సాయంత్రం వేళ మొక్కలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అప్పుడు వాటిని ముట్టుకోకూడదు. ఇలా కొన్ని నియమాలను పాటిస్తే ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. వాస్తు దోషాలు పోతాయి. సంపద సిద్ధిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment