QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. భారతదేశంలోని ప్రతి పౌరుడికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ద్వారా ఆధార్ కార్డు జారీ చేయబడుతుంది. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడానికి సహా దేనికైనా ఆధార్ తప్పనిసరి. ప్రాథమిక గుర్తింపు పత్రం కాబట్టి ఆధార్‌లోని సమాచారం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఎలా తనిఖీ చేయాలి? ఆధార్ కార్డుకు కుడివైపున ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆధార్ కార్డు వివరాలను తనిఖీ చేయవచ్చు. అసలు మీరు ఎప్పుడైనా ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు అని ఆలోచించారా..? దానితో ఏంటి ఉపయోగం తెలుసా..? ఈరోజు తెలుసుకుందాం..
Google Play Store, Apple Store, Windows ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల కోసం UIDAI యొక్క mAadhaar యాప్ లేదా UIDAI ఆమోదించిన QR కోడ్ స్కానింగ్ యాప్‌ని ఉపయోగించి మాత్రమే ఆధార్‌లోని QR కోడ్‌ని స్కాన్ చేయవచ్చు. విండోస్ అప్లికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.UIDAI వెబ్‌సైట్ ప్రకారం.. ఆధార్ QR కోడ్‌లలో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం మరియు ఆధార్ నంబర్‌తో సహా నివాసి వివరాలు ఉంటాయి.
M ఆధార్ యాప్ ద్వారా QR స్కాన్‌తో ఆధార్‌ని ఎలా ధృవీకరించాలి:
ముందుగా, M ఆధార్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేయండి. తర్వాత QR కోడ్ స్కానర్‌ని తీసుకోండి. ఆధార్ కార్డు కాపీలన్నింటికీ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు, ఆధార్‌లోని QR కోడ్‌ని స్కాన్ చేయండి. పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటోతో సహా ఆధార్ హోల్డర్ సమాచారాన్ని చూడవచ్చు. ఈ వివరాలు UIDAI ద్వారా డిజిటల్ సంతకం, ప్రామాణీకరించబడ్డాయి. ఫేక్ ఆధార్ కార్డు తయారు చేయిస్తే.. ఈ క్యూర్ కోడ్ ద్వారా తనిఖీ చేసినప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు.
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…