ఆధార్ కార్డు ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మనకు రేషన్ కార్డ్, పాన్ కార్డ్ ఎంత ముఖ్యమో ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రాముఖ్యత కూడా అంతే ఉంది. ప్రభుత్వం నుంచి లభించే ప్రతి పథకాన్ని లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డ్ అవసరం ఎంత అయితే ఉందో వాటి ద్వారా జరిగే మోసాలు కూడా అధికమయ్యాయి.ఈ క్రమంలోనే ఆధార్ కార్డు వినియోగించే వినియోగదారులందరూ కూడా ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని యూఐడీఏఐ హెచ్చరిస్తోంది.
ఆధార్ కార్డు తరచూ వినియోగిస్తున్న వినియోగదారులు ఆధార్ నెంబర్ ను కేవలం ఒక ప్రూఫ్ గా మాత్రమే వినియోగించవద్దని, ఎవరైనా ఆధార్ నెంబర్ చెబితే ఆ నెంబర్ మరొకసారి చెక్ చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ అయితే ఆధార్ కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ అయితే ఆధార్ వెరిఫై సర్వీసులను ఉపయోగించుకోవాలి. ఇలా చేసి ఆధార్ నెంబర్ ను ధ్రువీకరించుకోవాలి. ఇలా చేసినప్పుడు ఎలాంటి మోసాలకు తావుండదు.
చాలామంది పబ్లిక్ కంప్యూటర్లు ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఆధార్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెంటనే వాటిని డిలీట్ చేయాలి. అదేవిధంగా మన ఆధార్ కు సంబంధించిన ఓటిపి ఎవరికీ చెప్పకూడదు. అలాగే వేరొకరి ఆధార్ నెంబర్ ను మన మొబైల్ కి అప్డేట్ చేసుకోవద్దని ఈ సందర్భంగా యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలు వెల్లడించింది. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మోసాలకు చెక్ పెట్టవచ్చునని అధికారులు వెల్లడించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…