ఇంటి రుణాల‌పై త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న బ్యాంకుల వివ‌రాలు

March 30, 2021 5:55 PM

జీవితంలో సొంతంటి క‌ల‌ను నిజం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. డ‌బ్బుల‌ను ఒకేసారి చెల్లించి ఇల్లు క‌ట్టుకునేవారు, కొనేవారు త‌క్కువ మంది ఉంటారు. చాలా మంది లోన్ల‌ను తీసుకుని ఇళ్ల‌ను క‌ట్ట‌డ‌మో, కొన‌డ‌మో చేస్తుంటారు. అందులో భాగంగానే అనేక ఆర్థిక సంస్థ‌లు, బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌కు త‌క్కువ వ‌డ్డీల‌కే ఇంటి రుణాల‌ను అందిస్తున్నాయి. ఇక ప్ర‌స్తుతం మార్కెట్ స్థితిగ‌తుల‌కు అనుగుణంగా ప‌లు బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీకే ఇంటి రుణాల‌ను అందిస్తున్నాయి. ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

top banks giving lowest interest rates on home loans

కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు ఇంటి రుణాల‌పై 6.65 నుంచి 7.3 శాతం వ‌ర‌కు వ‌డ్డీని అందిస్తోంది. అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అయితే 6.7 నుంచి 7.2 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 6.7 నుంచి 8.05 శాతం, ఎస్‌బీఐ 6.75 నుంచి 8.2 వ‌ర‌కు, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు 6.8 నుంచి 8.9 వ‌ర‌కు, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 నుంచి 8.4 వ‌ర‌కు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా 6.85 నుంచి 8.7 శాతం వ‌ర‌కు, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండాయా 6.85 నుంచి 9.05 వ‌ర‌కు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 6.85 నుంచి 7.35 వ‌ర‌కు, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర 6.9 నుంచి 9.65 శాతం వ‌ర‌కు ఇంటి రుణాల‌పై వ‌డ్డీల‌ను అంద‌జేస్తున్నాయి.

ఇక ఈ రేట్లు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంటాయి. క‌నుక ఇంటి రుణం పొందాల‌నుకునేవారు ఈ రేట్ల‌ను ఒక‌సారి మ‌ళ్లీ ప‌రిశీలించి రుణం తీసుకోవ‌డం మంచిది. అలాగే క్రెడిట్ హిస్ట‌రీ స‌రిగ్గా ఉన్న‌వారు మాత్ర‌మే రుణానికి ద‌ర‌ఖాస్తు చేయాలి. లేదంటే రుణం మంజూరు కాక‌పోగా క్రెడిట్ స్కోరుపై ఆ ప్ర‌భావం ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment