స‌మాచారం

PM Kisan Yojana : పీఎం కిసాన్ డ‌బ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

PM Kisan Yojana : ప్ర‌ధాని మోదీ దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం పీఎం కిసాన్ యోజ‌న (ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న‌) ప‌థ‌కాన్ని గ‌తంలోనే ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విదిత‌మే. ఈ ప‌థ‌కం రైతుల‌కు ఒక వరం లాంటిది. ఇప్ప‌టికే ఎన్నో కోట్ల మంది రైతులు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొందుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రోమారు మోదీ అధికారంలోకి వ‌చ్చారు క‌నుక మ‌ళ్లీ ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు 17వ ద‌ఫా కింద న‌గ‌దును బ‌దిలీ చేశారు. గ‌తంలో ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన 16వ ద‌ఫా న‌గ‌దును ఇచ్చారు. ఇప్పుడు 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రిలీజ్ చేశారు. దీనిపై మోదీ ప్ర‌ధాని అయ్యాక తొలి సంత‌కం చేశారు. ప్ర‌స్తుతం ఖ‌రీఫ్ స‌మ‌యం ఆరంభం అయింది. అందువ‌ల్ల రైతుల పెట్టుబ‌డికి ఈ న‌గదు ఉప‌యోగం కానుంది.

అయితే ఈ ప‌థ‌కంలో మీరు ల‌బ్ధిదారులుగా ఉన్న‌ప్ప‌టికీ న‌గ‌దు బ‌దిలీ అవ‌డం లేదు అంటే మీరు ఈ-కేవైసీ చేయించుకోలేద‌ని అర్థం. ఈ క్ర‌మంలోనే దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పీఎం కిసాన్ ప‌థ‌కానికి సంబంధించిన ఇన్‌స్టాల్‌మెంట్ ను ప్ర‌తి ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా స‌మ‌యానికే రిలీజ్ చేశారు. అయితే ఈ న‌గ‌దు ఈ నెల చివ‌రి వ‌ర‌కు రైతుల ఖాతాల్లో జ‌మ కానుంది. ఇక ఈ విడ‌త కింద రూ.2వేల‌ను ఇస్తున్నారు. ఈ ప‌థ‌కం కింద న‌మోదు చేసుకున్న రైతులు త‌ప్ప‌నిస‌రిగా ఈ-కేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలి. లేదంటే న‌గ‌దు బ‌దిలీ అవ‌దు. క‌నుక ఈ-కేవైసీ స‌రిగ్గా ఉందో లేదో రైతులు చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది.

PM Kisan Yojana

పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అక్క‌డ ఈ-కేవైసీ అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. అక్క‌డ 12 అంకెలున్న మీ ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. అనంత‌రం సెర్చ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని న‌మోదు చేయాలి. త‌రువాత స‌బ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ కేవైసీ పూర్త‌వుతుంది. అయితే మీరు ఇచ్చిన స‌మాచారంలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని స‌రిచేసుకోవ‌చ్చు. లేదంటే మీ బ్యాంకు ఖాతాలో న‌గ‌దు బ‌దిలీ అవ‌దు. క‌నుక ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు pmkisan-ict@gov.in కి ఈ-మెయిల్ పంపించ‌వ‌చ్చు. లేదా పీఎం కిసాన్ యోజన ఫోన్‌ నంబర్స్ 155261, 1800115526(టోల్ ఫ్రీ), లేదా 011-23381092కు కాల్ చేయ‌వ‌చ్చు.

కాగా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాల‌ను అందిస్తుండ‌గా వాటిల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. దీని ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను ఇస్తుంది. పెట్టుబడి స‌హాయం అందిస్తుంది. ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు ప్రతి ఏడాది రూ. 6000 అందిస్తున్నారు. అయితే దీనిని ఒకేసారి కాకుండా 3 సమాన ఇన్‌స్టాల్‌మెంట్లలో అందిస్తుంది. అంటే ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్లో రూ. 2000 చొప్పున రైతులకు వ‌స్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM