PM Awas Yojana : దేశంలోని పౌరుల సొంతింటి కలను నిజం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పథకమే.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. ఈ పథకం కింద పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు తక్కువ ఖర్చులోనే ఇంటిని నిర్మించుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే వారు ఈ పథకానికి అర్హులు. దీన్ని 2015లో జూన్ 25వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇంటి రుణాలపై సబ్సిడీని అందిస్తుంది. ఇంటి యజమానికి వచ్చే ఆదాయంపై ఆధారపడి సబ్సిడీని అందిస్తారు. ఈ పథకం కింద బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేట్లకే ఇంటి రుణాలను అందిస్తున్నాయి. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు తీసుకున్న రుణం మొత్తాన్ని 20 ఏళ్లలోగా చెల్లించాల్సి ఉంటుంది. గత 10 ఏళ్ల నుంచి ఈ పథకం కింద మొత్తం 4.1 కోట్ల మంది లబ్ధి పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుడి వయస్సు 18 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉండాలి. భారతీయ పౌరుడు అయి ఉండాలి. దేశంలో ఎక్కడా అతని పేరు మీద ఇల్లు ఉండకూడదు. లబ్ధిదారుడి ఏడాది ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండాలి. అంతకన్నా మించరాదు. లబ్ధిదారుడి రేషన్ కార్డు బీపీఎల్ లిస్ట్‌లో ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పథకం కింద లబ్ధి అందిస్తారు. ఇక ఇందుకు ఏయే డాక్యుమెంట్లు కావాలో ఇప్పుడు చూద్దాం.
ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటో, స్వచ్ఛ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్, బ్యాంకు పాస్‌బుక్, మొబైల్ నంబర్, ఆదాయ ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఆన్‌లైన్‌లో pmaymis.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించాక అందులో హోమ్ పేజీలో ఉండే Pmavasyojana అనే లింక్‌ను క్లిక్ చేయాలి. అందులో రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం వచ్చే ఫామ్ లో అన్ని వివరాలను నమోదు చేయాలి. అనంతరం డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అనంతరం సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. దీంతో దరఖాస్తు ఫామ్ సబ్‌మిట్ అవుతుంది.
ఆఫ్‌లైన్‌లోనూ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గాను పౌరులు తమకు సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసే సమయంలో పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఒరిజినల్ పత్రాలను చూపించి జిరాక్స్ కాపీలను ఇవ్వాలి. దీంతో అప్లికేషన్ సబ్‌మిట్ చేస్తారు. ఈ క్రమంలో మీ వివరాలను పరిశీలించాక మీరు అర్హులైతే మీకు ఈ పథకం కింద లబ్ధి లభిస్తుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…