lifestyle

Vankaya Wey Fry Recipe : వంకాయ కూర‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే జ‌న్మ‌లో మ‌రిచిపోరు..!

Vankaya Wey Fry Recipe : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. ఇవి అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వంకాయ‌ల‌తో మ‌నం అనేక కూర‌ల‌ను కూడా చేస్తుంటాం. స‌రిగ్గా చేయాలే కానీ వంకాయ‌ల‌తో ఏ కూర చేసినా రుచి అదిరిపోతుంది. చాలా మంది వంకాయ‌లను ఇష్టంగా తింటుంటారు కూడా. అయితే వంకాయ‌ల‌తో ఇప్పుడు మేం చెప్ప‌బోయే విధంగా కూర చేయండి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి ఇలా గ‌న‌క చేసుకున్నారంటే ఇంట్లో అంద‌రూ మ‌ళ్లీ ఇలాగే చేయ‌మ‌ని అడుగుతారు. అంత అద్భుతంగా రుచి ఉంటుంది. ఇక వంకాయ కూర‌ను ఎలా చేయాలో, అందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీడియం సైజు వంకాయ‌లు – 2 (నాలుగు ముక్క‌లుగా త‌ర‌గాలి), మీడియం సైజు ట‌మాటాలు – 2 (స‌న్న‌గా త‌ర‌గాలి), ఉల్లిపాయ – 1 (స‌న్న‌గా త‌ర‌గాలి), ప‌చ్చి మిర్చి – 2 (నిలువుగా చీరాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్‌, ఆవాలు – 1 టీస్పూన్‌, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, క‌రివేపాకు – 1 రెమ్మ‌, ప‌సుపు – అర టీస్పూన్‌, కారం – 1 టీస్పూన్ లేదా రుచికి స‌రిప‌డా, ధ‌నియాల పొడి – 1 టీస్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నూనె – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర ఆకులు – కొన్ని (అలంక‌ర‌ణ కోసం).

Vankaya Wey Fry Recipe

వంకాయ కూర‌ను త‌యారు చేసే విధానం..

ముందు పాన్ లేదా క‌డాయి పెట్టి అందులో నూనె వేసి మీడియం మంట‌పై వేడి చేయాలి. అనంత‌రం అందులో ఆవాల‌ను వేసి చిట‌ప‌ట‌లాడించాలి. అందులోనే జీల‌క‌ర్ర‌, క‌రివేపాకుల‌ను వేయాలి. కాసేపు సువాస‌న వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. అందులోనే స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు, నిలువుగా చీరిన ప‌చ్చి మిర్చి వేయాలి. ఉల్లిపాయ‌లు బంగారు గోధుమ రంగులోకి మారేంత వ‌ర‌కు వేయించాలి. అనంత‌రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత 1 నిమిషం అయ్యాక ప‌చ్చి వాస‌న పోతుంది. అనంత‌రం అందులో స‌న్న‌గా త‌రిగిన ట‌మాటాల‌ను వేసి ట‌మాటాలు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. అందులోనే ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, ఉప్పు వేసి బాగా క‌లిపి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత త‌రిగిన వంకాయ ముక్క‌ల‌ను వేయాలి.

బాగా క‌లిపి మూత పెట్టాలి. ఇలా 10-15 నిమిషాల పాటు ఉడికించాలి. మ‌ధ్య మ‌ధ్య‌లో మూత తీసి క‌లుపుతుండాలి. అందులో నీళ్ల‌ను క‌ల‌పాల్సిన ప‌ని ఉండ‌దు. మూత పెట్టి ఉడికిస్తాం కాబ‌ట్టి అందులో ఊరే నీళ్లు స‌రిపోతాయి. దీంతో వంకాయ‌లు, ట‌మాటాలు బాగా ఉడుకుతాయి. అన్నీ బాగా ఉడికాక మూత తీసి మ‌ళ్లీ 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో అద‌నంగా ఉన్న నీరు పోతుంది. అప్పుడు కూర బాగా వ‌స్తుంది. మ‌రీ నీళ్లు లేకుండా మ‌రీ ఫ్రై కాకుండా మ‌ధ్య‌స్తంగా ఉంటుంది. దీంతో కూర రెడీ అవుతుంది. దానిపై కొత్తిమీర ఆకుల‌ను వేసి అల‌క‌రించుకుంటే చాలు. ఇలా త‌యారు చేసిన వంకాయ వెట్ ఫ్రై కూర అంద‌రికీ ఎంత‌గానో న‌చ్చుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలు ఎందులో అయినా స‌రే తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM