ఆధార్ గుడ్ న్యూస్‌.. ఇక మీ ఇంటి వ‌ద్దే మొబైల్ నంబ‌ర్‌ను అప్‌డేట్ చేసుకోవ‌చ్చు..!

July 22, 2021 11:46 AM

ఆధార్ కార్డుకు మొబైల్ నంబ‌ర్ లింక్ కాలేదా ? లింక్ అయినా వేరే వాళ్ల నంబ‌ర్ ఉందా ? ఇప్ప‌టికే లింక్ అయి ఉన్న నంబ‌ర్ ప‌నిచేయక వేరే నంబ‌ర్‌ను అప్ డేట్ చేసుకోవాల‌నుకుంటున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక‌పై మీ ఇంటి వ‌ద్దే మీ ఆధార్ కార్డు ఫోన్ నంబ‌ర్‌ను అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. అందుకు గాను కొత్త స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.

now you can change your aadhar phone number at your home in this way

యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. దీని ప్ర‌కారం.. మీరు మీ ఆధార్ కార్డు ఫోన్ నంబ‌ర్‌ను మీ ఇంటి వ‌ద్దే అప్ డేట్ చేసుకోవచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సేవ కోసం ఆధార్ సెంట‌ర్‌కు వెళ్లాల్సి ఉండేది. కానీ ఇక దీన్ని ఇంటి వ‌ద్దే పొంద‌వ‌చ్చు. ఇందుకుగాను పోస్ట్‌మ్యాన్‌లు స‌హాయం చేస్తారు. వారు మీ ఆధార్ ఫోన్ నంబ‌ర్‌ను మారుస్తారు.

దేశంలోని 1.46 ల‌క్ష‌ల మంది పోస్ట్‌మ్యాన్‌లు ఈ స‌హాయం అందించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 650 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ల ద్వారా ఈ సేవ‌ను అందిస్తారు. అలాగే గ్రామీణ్ డాక్ సేవ‌క్‌లు కూడా ఈ సేవ‌ను అందిస్తారు. అందువ‌ల్ల మీరు మీ ఆధార్ ఫోన్ నంబ‌ర్‌ను మార్చుకోవాలంటే ఇక ఆధార్ సెంట‌ర్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు. మీ ఇంటికి వ‌చ్చే పోస్ట్‌మ‌న్‌తోనే ఆ నంబ‌ర్‌ను సుల‌భంగా మార్పించుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ఆధార్ గుడ్ న్యూస్‌.. ఇక మీ ఇంటి వ‌ద్దే మొబైల్ నంబ‌ర్‌ను అప్‌డేట్ చేసుకోవ‌చ్చు..!”

Leave a Comment