ఈ బ్యాంకు కస్టమర్లకు భారీ షాక్.. సామాన్య ప్రజలపై పడనున్న అధిక భారం!

August 1, 2021 10:19 PM

మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమరా? మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? అయితే మీరు నిజంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. ఆగస్టు 1వ తేదీ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ సరికొత్త రూల్స్ ను అమలులోకి తీసుకు వస్తోంది. ఈ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడనుంది. మరి ఆగస్టు 1వ తేదీ నుంచి ఎలాంటి రూల్స్ అమలులోకి వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

icici bank customers new rules

ప్రస్తుతం కస్టమర్లకు 25 చెక్కులతో కూడిన ఒక చెక్ బుక్ బ్యాంక్ ఉచితంగా ఇకపై అదనంగా మరొక చెక్ బుక్ కావాలంటే కస్టమర్లు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ లిమిటెడ్ దాటిన తరువాత ప్రతి ఒక కస్టమర్ పది చెక్కులతో కలిగిన ఒక బుక్ కి రూ 20లు చొప్పున చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు 1వ తేదీ నుంచి తొలి నాలుగు సార్లు చేసుకునే క్యాష్ విత్ డ్రా యల్ పై ఎలాంటి అదనపు చార్జీలు వర్తించవు. ఈ క్రమంలోనే ప్రతి నెల వరకు లక్ష రూపాయల వరకు ఎలాంటి చార్జీలు చెల్లించకుండా విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తరువాత ప్రతి వెయ్యి రూపాయల విత్ డ్రా పై రూ.5 చెల్లించుకోవాల్సి వస్తుంది.

ఆగస్టు 1వ తేదీ తర్వాత బ్యాంకు నెలలో తొలి మూడు లావాదేవీలను (ఏటీఎం కార్డు లేకుండా) ఎలాంటి చార్జీలు లేకుండా పొందవచ్చు. ఇది మెట్రో నగరాలకు కూడా వర్తిస్తుంది. ఈ లిమిట్ దాటితే ఒక్కో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పై 20 రూపాయలు, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పై 8.5 రూపాయలను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇతర ప్రాంతాలలో అయితే నెలలో ఐదు లావాదేవీలను ఉపయోగించవచ్చు. వాటికి ఎలాంటి చార్జీలు వర్తించవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now