Torn Currency Notes : అందరూ అన్ని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోలేరు. కొన్ని రకాల వస్తువులు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల డ్యామేజ్ అవుతుంటాయి. అలాగే కరెన్సీ నోట్లు కూడా కొన్ని కారణాల వల్ల చిరిగిపోతుంటాయి. ఇక కొన్ని నోట్లు అయితే మురికి లేదా మరకలు అంటుకుంటాయి. కొన్ని నోట్లపై రాతలు రాస్తారు. ఇలా అనేక రకాల కారణాల వల్ల నోట్లు డ్యామేజ్ అవుతుంటాయి. అయితే మీ వద్ద కూడా ఇలాంటి నోట్లు ఉంటే మీరు దిగులు పడాల్సిన పనిలేదు. వాటిని మీరు ఎంచక్కా మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ వద్ద చిరిగిన లేదా పాడైపోయిన, మరకలు అంటిన కరెన్సీ నోట్లు ఉంటే వాటిని మీరు మీకు సమీపంలోని ఆర్‌బీఐ శాఖ కార్యాలయం లేదా మీకు సమీపంలోని ఏదైనా బ్యాంకులో మార్చుకోవచ్చు. అయితే కరెన్సీ నోట్లను ఇలా మార్పిడి చేసేందుకు బ్యాంకులు కొంత రుసుము వసూలు చేస్తాయి. సాధారణంగా అలాంటి కరెన్సీ నోట్ల విలువ రూ.5వేల వరకు ఉండి నోట్లు 20 వరకు ఉంటే వాటిని ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఉచితంగానే బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చు. అలాగే 20 నోట్ల కన్నా ఎక్కువ ఉండి వాటి విలువ రూ.5వేలకు మించితే మాత్రం బ్యాంకులు కొంత రుసుము వసూలు చేసి ఆ నోట్లను మార్పిడి చేస్తాయి.
ఇక అలాంటి నోట్ల విలువ రూ.50వేలకు మించితే మాత్రం బ్యాంకులు కాస్త జాగ్రత్త తీసుకుంటాయి. మీ వివరాలను పూర్తిగా నమోదు చేసి కొంత ఎక్కువ రుసుముతో ఆ నోట్లను మార్పిడి చేస్తాయి. అయితే మీరు అలాంటి నోట్లను బ్యాంకుల్లో రోజుకు 20 నోట్ల వరకు మాత్రమే మార్పిడి చేసుకోవచ్చు. అలాగే వాటి విలువ రూ.5వేలు లేదా అంతకు లోపు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే మరుసటి రోజు మార్పిడి చేసుకోవాలి. ఇలా మీ వద్ద ఉన్న చిరిగిన నోట్లను మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే మీ వద్ద ఉన్న అలాంటి కరెన్సీ నోట్లను బ్యాంకులు గనక తీసుకోకపోతే అప్పుడు మీరు ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించి మీరు అందులో మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. లేదా ఆర్‌బీఐకి కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీంతో బ్యాంకుపై ఆర్‌బీఐ వారు తగిన చర్యలు తీసుకుంటారు.
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…