స‌మాచారం

Footwear : ఆగ‌స్టు 1 నుంచి పెర‌గ‌నున్న ఫుట్‌వేర్ ధ‌ర‌లు.. ఎందుకో తెలుసా..?

Footwear : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈమ‌ధ్యే పార్ల‌మెంట్‌లో 2024-25 సంవ‌త్స‌రానికి గాను బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌తి ఏటా బ‌డ్జెట్ వ‌ల్ల కొన్ని వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతాయి. మ‌రికొన్ని వ‌స్తువుల ధ‌ర‌లు మాత్రం త‌గ్గుతాయి. కానీ బ‌డ్జెట్‌తో సంబంధం లేకుండానే ఈసారి ఫుట్‌వేర్ ధ‌ర‌లు మాత్రం పెర‌గ‌నున్నాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిట‌నేది ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నం ధ‌రించే శాండ‌ల్స్‌, స్లిప్ప‌ర్స్‌, ఇత‌ర చెప్పుల‌తోపాటు షూస్ కూడా నిర్దిష్ట‌మైన నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను క‌లిగి ఉంటాయి. బ్రాండెడ్ కంపెనీవి అయితే ఎక్కువ నాణ్యంగా ఉంటాయి. ఎక్కువ కాలం పాటు మ‌న్నుతాయి. అయితే ఇక‌పై ఫుట్‌వేర్ త‌యారీదారులు క‌చ్చితంగా ప‌లు నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను పాటించాల్సిందే. ఫుట్‌వేర్ త‌యారీలో ఉప‌యోగించే మెటీరియ‌ల్స్‌కు గాను త‌యారీదారులు ఐఎస్ 6721, ఐఎస్ 10702 ప్ర‌మాణాల‌ను పాటించాల్సి ఉంటుంది. అంటే ఈ ప్ర‌మాణాల‌తో త‌యారు చేసే ఫుట్‌వేర్ వినియోగ‌దారుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండాలి. అలాగే ఎక్కువ‌కాలం పాటు మ‌న్నాలి. ఇలా నాణ్య‌త‌ను పాటిస్తూ ఏ ఫుట్‌వేర్‌ను అయినా స‌రే త‌యారు చేయాల్సి ఉంటుంది. ఈ మేర‌కు బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్ (బీఐఎస్‌) ఫుట్‌వేర్ త‌యారీదారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

Footwear

అయితే చిన్న‌పాటి చెప్పుల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు ఈ నియ‌మం వ‌ర్తించ‌దు. ఏడాదికి రూ.50 కోట్ల క‌న్నా త‌క్కువ ట‌ర్నోవ‌ర్ క‌లిగిన కంపెనీలు ఈ నిబంధ‌న‌ల‌ను పాటించాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే ఆగ‌స్టు 1 వ‌ర‌కు ఉన్న స్టాక్‌కు కూడా ఈ నిబంధ‌న వ‌ర్తించ‌దు. కానీ ఆ స్టాక్ వివ‌రాల‌ను త‌యారీదారులు బీఐఎస్ వెబ్‌సైట్‌లో న‌మోదు చేయాల్సి ఉంటుంది.

అయితే బీఐఎస్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల చాలా వ‌ర‌కు బ్రాండ్ల‌కు చెందిన ఫుట్‌వేర్ ధ‌ర‌లు పెరుగుతాయ‌ని అంటున్నారు. వినియోగ‌దారుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన, నాణ్య‌మైన ఫుట్‌వేర్‌ను అందించాలంటే అందుకు వాడే మెటీరియ‌ల్‌ను కాస్త ఖ‌రీదైన‌ది వాడాలి. దీంతో ఫుట్‌వేర్ ధ‌ర‌లను పెంచ‌క త‌ప్ప‌దు. అయితే దీనిపై బీఐఎస్ స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌లేదు. కానీ ఫుట్‌వేర్ ధర‌లు మాత్రం క‌చ్చితంగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM